
రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
రాయదుర్గం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా రాయదుర్గం ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఉదయమే డిపో వద్దకు చేరుకుని బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.