'ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?' | YSRCP spokes person vasi reddy padma slams Yellow media on ED cases against jaganmohan reddy | Sakshi
Sakshi News home page

'ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?'

Published Sun, Apr 2 2017 1:47 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

'ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?' - Sakshi

'ఈడీ, సీబీఐ ఏం చేసినా జగన్‌కు అంటగడతారా?'

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం అన్నారు. కేసుల విషయంలో జగన్‌ ఎప్పుడూ భయపడలేదని, ఎవరికీ లొంగలేదని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఓటుకు కోట్లు కేసులో కేంద్రం కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను చూసి ఎల్లో మీడియా, చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.

జగన్‌ను ఎదుర్కోవడం చేతకాక చీప్‌ట్రిక్స్‌ చేస్తున్నారని అన్నారు. జగన్‌ కంపెనీలపై ఈడీ దాడులంటూ ఒక పత్రిక తప్పుడు కథనాలు రాసిందని చెప్పారు. అది సూట్‌ కేసు కంపెనీలు, మనీలాండరింగ్‌ అంటూ బురదజల్లే యత్నమని అన్నారు. సీబీఐ, ఈడీ ఏం చేసినా జగన్‌కు అది అంటగడతారా? అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన ఎల్లో మీడియా.. జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని యత్నిస్తోందని అన్నారు. చంద్రబాబు చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement