సాక్షి ప్రతినిధి విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 4న సమీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించిం ది. రాజమండ్రి కేంద్రంగా జరిగే ఈ సమీక్షల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గోనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. భవిష్యత్‌లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల వారీగా పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు జిల్లాల్లో సమీక్షలు నిర్వహించగా... ఈనెల 4న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సమీక్ష జరగనుంది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షల్లో ముందుగా 2.30 గంటల నుంచి 3 గంటల వరకు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం, 3 నుంచి 3-30 గంటల వరకు రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, 3.30 నుంచి 4 గంటల వరకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం, 4 నుంచి 4.30 గంటల వరకు చీపురుపల్లి అసెం బ్లీ నియోజకవర్గం, 4.30 నుంచి 5 వరకు గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం, 5 నుంచి 5.30 వరకు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం, 5.30 నుంచి 6 గంటల వరకు బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నా యి. ఈ సమీక్షలో జిల్లాకు చెందిన పార్టీ నాయకు లు పాల్గొని పార్టీ జయపజయాలపై చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
4న రాజమండ్రిలో
Published Sun, Jun 1 2014 1:32 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement