ప.గో:భవిష్యత్తులో దేశ ప్రధానిని నిర్ణయించే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు జంగారెడ్డి గూడెంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన వైఎస్సార్ సీపీ గెలిచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతా నిబద్ధతతో కృషి చేస్తే వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అసలు బాబు.. సమైక్య రాష్ట్రానికి కట్టుబడ్డరా?లేక విభజనకు అనుకూలంగా ఉన్నరా?అనే అంశంపై ప్రజలకు స్పష్టమైన వైఖరి చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.