thota chandrasekhar
-
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలపై విమర్శలు
-
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలకనేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు ఏపీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో తోట చంద్రశేఖర్, మాజీమంత్రి రావెల కిశోర్‌బాబుతో పాటుగా పలువురు నేతలు కూడా పార్టీలో చేరేందుకు సోమవారం రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు వీరి చేరిక కార్యక్రమం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చేరిక అనంతరం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటిస్తారని, ఆయన సమక్షంలోనే తోట చంద్రశేఖర్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. కాగా, రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, ఐఆర్ఎస్ మాజీ అధికారి చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్‌తో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరతారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్ 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిత్య హైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ నుంచి ఏలూరు ఎంపీగా, 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇదిలాఉంటే 1987 ఐఆర్టీఎస్ కేడర్ అధికారి రావెల కిశోర్ బాబు 2014–18 మధ్యకాలంలో ఏపీ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరి పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
ఈ దూకుడు.. సాటెవ్వరూ..
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల హవా ప్రచారంతోపాటు అన్ని అంశాల్లోనూ ముందంజ ఆందోళనలో టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థులు కమలం, సైకిల్‌కు బ్రేకులు ఖాయం ! ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు పెరుగుతోంది. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు దుమ్మురేపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతోపాటు అన్ని విషయల్లోనూ ముందుంటూ పైచేయి సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన తెలుగుదేశం అభ్యర్థికి అందనంత స్పీడులో వెళుతున్నారు. ఇక నరసాపురం ఎంపీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ ఆలస్యంగా వచ్చినా పట్టు బిగించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు టీడీపీ నేతలను దారికి తెచ్చుకునే పనిలో ఉండగానే రవీంద్రనాథ్ దూసుకు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల్లో నైరాశ్యం అలముకుంది. గెలుపుపై మొన్నటి వరకూ ధీమా వ్యక్తం చేసిన టీడీపీ, భాజపాల ఎంపీ అభ్యర్థుల స్వరంలో మార్పు వచ్చింది. దీంతో ఏలూరు, నరసాపురంలో వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. వారి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు ఇంటింటా విస్తృతంగా పర్యటించి తాము గెలిస్తే ఏంచేస్తామో ఓటర్లకు వివరిస్తూ తోట చంద్రశేఖర్, వంక రవీంద్ర నాథ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీలను ఏమాత్రం నమ్మేస్థితిలో లేని ఓటర్లు టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మాటలను విశ్వసించడం లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. కుదరని పొత్తులు.. మొదట్లో తామే విజయం సాధిస్తామంటూ బీరాలు పలికిన టీడీపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థులు చివరకు డీలా పడిపోయారు. టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, బీజేపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు అసలు జనాల్లోకే వెళ్లలేదు. టీడీపీ, బీజేపీ జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగటం ఎంతవరకూ లాభిస్తుందో తెలుగు తమ్ముళ్లకే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నరసాపురం ఎంపీ బరిలో నిలిచేందుకు చివరివరకూ ప్రయత్నించి విఫలమైన రఘురామకృష్ణంరాజు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కనీసం ఒక్కసారి కూడా బీజేపీ తరఫున ప్రచారం చేయకపోవడం, టీడీపీ నేతలు సైతం నరసాపురం సీటుపై పెద్దగా దృష్టి సారించకపోవటం బీజేపీ నేతలను కలవరపెడుతున్నాయి. ఇక ఏలూరు లో మాగంటి బాబు దాదాపు కాడి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఏలూరు పార్లమెంటరీ ని యోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు మాగంటి తీరుపై ఆందోళన చెందుతున్నా రు. బీజేపీతో పొత్తుపెట్టుకోవటం ద్వారా తమకు లాభం లేకపోగా సంప్రదాయ ఓటర్లను నష్టపోతున్నామనే భావన టీడీపీ నేతల్లో నెలకొంది. టీడీపీకి పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తోటకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. తోట, వంక విస్తృత ప్రచారం ఎన్నికలు సమీపిస్తున్న తరుణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు అభ్యర్థి తోట చంద్రశేఖర్, నరసాపురం అభ్యర్థి వంక రవీంద్రనాథ్ తమదైన శైలిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారు. తోట చంద్రశేఖర్ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో అమలు చేస్తానంటూ హామీ ఇవ్వటంతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అదేస్థాయిలో వంక రవీంద్రనాథ్ కూడా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యపై పూర్తి అవగాహనతో వాటిని ఎలా పరిష్కరిస్తామో.. ఎలా అభివృద్ధి చేస్తామో వివరించి ముం దుకు సాగారు. ప్రధానంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తిచేయటం, డెల్టా ఆధునికీకరణ, నరసాపురం-విజయవాడ-నిడదవోలు రైల్వే లైను డబ్లింగ్ పనులు చేపట్టడం, కొత్తగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్పాటు సామాజికవర్గాల సమీకరణలు వీరికి కలిసిరానున్నాయి. -
ఏలూరుకు వైఎస్ఆర్ సీపీ స్పెషల్ మేనిఫెస్టో
కొల్లేరు సరస్సును ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తామని ఏలూరు లోక్‌సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.తోట చంద్రశేఖర్ వెల్లడించారు. కొల్లేరు లంక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏలూరు పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను డా.తోట చంద్రశేఖర్, ఏలూరు నగర ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆళ్ల నానిలు శనివారం ఇక్కడ విడుదల చేశారు. మోడల్ సిటీగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయడంతోపాటు నిర్వాసితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పోలవరం ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చింతలపూడి, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తామని వివరించారు. ఏలూరులో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నూజివీడులో మ్యాంగో మార్కెట్ యార్డ్ ఏర్పాటు, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏలూరులో సూపర్ స్పెషాలిటి హాస్పటల్, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, ఆక్వాహబ్ ఏర్పాటు చేస్తామన్నారు. తమ్మిలేరు నుంచి ఏలూరుకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తామని తోట చంద్రశేఖర్, అళ్ల నాని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. -
చంద్రశేఖర్, దేవీప్రియను గెలిపించండి
చింతలపూడి, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మద్దాల దేవీప్రియను అఖండ మెజార్టీతో గెలిపించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై గల అభిమానాన్ని చాటాలని పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు చింతలపూడి చేరుకున్న ఆమె ఇక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు జరిగిన జనభేరి సభలో విజయమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మనసున్న మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తమది మాటతప్పే కుటుంబం కాదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తారని అన్నారు. విజయమ్మకు మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్‌కుమార్, ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్లు మేడవరపు అశోక్, బొడ్డు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి జె.జానకిరెడ్డి, సర్పంచ్ మారిశెట్టి జగన్, పార్టీ మండల కన్వీనర్ తుమ్మూరి వెంకట్రామిరెడ్డి, పట్టణ కన్వీనర్ గంధం చంటి తదితరులు ఘనస్వాగతం పలికారు. విజయమ్మ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలులింగపాలెం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే సుభాని, సుగుణరావు, పి.రాటాలు, తాళం చెన్నారావు, సీహెచ్ ప్రభుదాస్ తదితరులు తమ అనుయూయులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చింతలపూడిలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదు : తోట చంద్రశేఖర్ జనభేరి సభలో ఏలూరు ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల్ని ఓట్లడిగే హక్కు చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణమైన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవించారని పేర్కొన్నారు. 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు, ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు, ఆరు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని రూ.5.25కు పెంచి పేదవాడికి పట్టెడు అన్నం కూడా అందకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఇన్ని ఘనకార్యాలు చేసి మళ్లీ ఓట్లు అడగడానికి సిగ్గు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. రైతులకు, పేదలకు, మహిళలకు మేలు జరిగింది వైఎస్ పాలనలో మాత్రమేనని చంద్రశేఖర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చే భద్రాచలం -కొవ్వూరు రైల్వే లైను, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే వైఎస్ జగన్ కావాలని అన్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణానికి, హైదరాబాద్ వంటి రాజధాని నిర్మాణం చేయగలిగే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని చెప్పారు. మీ ఆదరాభిమానాలు కావాలి : దేవీప్రియ చింతలపూడి అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చి వైఎస్ జగన్ తనను ఆశీర్వదించారని, ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలు ఆదరించాలని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దేవీప్రియ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
ఏలూరులో ఓటేసిన చంద్రశేఖర్
ఏలూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఏలూరు 28వ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్ కేపీడీటీ హైస్కూల్లో ఆదివారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన సోదరుడు తోట సత్యనారాయణ, కుమారుడు ఆదిత్య సైతం ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తీరు ఈ విషయూన్ని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. కనీసం 35 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగిస్తారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఏలూరు నగరాన్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తామని, సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, ఘంటా ప్రసాదరావు ఉన్నారు. -
అభివృద్ధి చేసి చూపిస్తా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ప్రాంతాన్ని రాష్ట్ర చిత్రపటంలో ప్రముఖంగా నిలబెట్టేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశానని, ఎంపీగా ఎన్నికైన వెంటనే దానిని అమలు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, డెల్టా ఆధునికీకరణ, కొల్లేరు సహా ఆరు కీలక సమస్యలను తాను ప్రాధాన్యతా అంశాలుగా తీసుకున్నానని తెలి పారు. ఎంపీగా ఎన్నికైన మరుక్షణం వాటిపై పనిచేయడం మొదలు పెడతానన్నారు. ఐఏఎస్ అధికారిగా ముంబయ్ మహానగరంతోపాటు మహారాష్ట్రలో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. ఏలూ రు పరిసరాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని చెప్పారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో శనివారం ఆయనను ‘సాక్షి’ ఇంటర్య్వూ చేసింది. ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగుతున్నారు.. మీ విజన్ ఏమిటి జవాబు : అందరిలా ఎడాపెడా హామీలు ఇవ్వను. దూరదృష్టితో ఆలోచిస్తాను. విస్తృత అధ్యయనం తర్వాత ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశాను. అందులో కీలకమైన ఆరు అంశాలపై దృష్టి పెడతాను. రైతన్నల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించడమే నా మొదటి లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే రెండు లక్షల మందికి పూర్తిస్థాయి పునరావాసం కల్పించే బాధ్యత ఉంది. దాన్ని ఎలా చేయాలనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. రెండోది భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తా. ఈ ప్రాజెక్టు వల్ల చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. మూడోది కొల్లేరు అంశం. పర్యావరణ సమతుల్యతను సాధిస్తూనే ఇక్కడి ప్రజల హక్కులను కాపాడటం ఒక సవాల్. కాంటూరు పరిధిని మూడుకు తగ్గిస్తామని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. నాలుగోది చింతలపూడి ఎత్తిపోతల పథకం. దీన్ని పూర్తి చేయించే బాధ్యత కూడా తీసుకుంటా. డెల్టా రైతులకు మరణ శాసనంగా మారిన ముంపు సమస్యను పరిష్కరించే డెల్టా ఆధునికీకరణను పూర్తి చేయించడం నా విధి. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుగారి కంపెనీ నిర్మాణ పనులను చేజిక్కించుకుని ఆలస్యం చేసింది. అలాంటి వాటన్నింటినీ పరిష్కరించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తా. ఏలూ రు నగరాన్ని అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నగరానికి ముంపు సమస్య లేకుండా చేయడంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను పక్కాగా నిర్మింపచేస్తా. ఏలూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనేది నా ప్రధాన డిమాండ్. ఈ విషయాన్ని ఇప్పటికే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో పెట్టా ను. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. రెండు ఎయిర్‌పోర్టులు, రెండు పోర్టులతోపాటు అన్ని ప్రాంతాలను కలిపే రైలుమార్గం, జాతీయ రహదారి ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఇంతకంటే మెరుగైన ప్రాంతం మరొకటి లేదు. లక్షా 20 వేల మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను క్రోడీకరించిన తర్వాతే ఈ లక్ష్యాలను మీకు చెబుతున్నా. నన్ను ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఎలా ఉంది జవాబు : కొంతకాలంగా వెలువడుతున్న అన్ని సర్వే ఫలి తాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెబుతున్నా యి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల తేడా ఉంది. జనం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకం పెట్టుకున్నారనడానికి ఈ సర్వేలే నిదర్శనాలు. కాంగ్రెస్, టీడీ పీ, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదు. వారి ఆశలన్నీ వైఎస్ జగన్‌పైనే ఉన్నాయి. ఆయన దృఢవైఖరి, పోరాటపటిమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోను, కేంద్రం లోను వైఎస్సార్ సీపీ కీలకం కాబోతోంది. రాష్ట్ర పునర్నిర్మాణం వైఎస్ జగన్మోహనరెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక విజన్ ఉన్న నాయకుడాయన. చంద్రబాబుకు అవకాశం ఇస్తే రెండు, మూడేళ్ల తర్వా త పరిస్థితి ఏమిటి. ఆయన వృద్ధాప్యంతో పక్కకు తప్పుకుంటే రాష్ట్రం ఏమవుతుంది. అందుకే యువకు డు, దూరదృష్టి ఉన్న వైఎస్ జగన్‌ను అందరూ ఆమోదిస్తున్నారు. మీ విద్యాభాస్యం వివరాలు చెబుతారా జవాబు : గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్, ముంబయ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొం దాను. సమాజానికి సేవ చేయాలంటే సివిల్ సర్వీసులే కీలకమని భావించాను. 1987లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. ఐఏఎస్‌గా మహారాష్ట్రలో 22ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశా. నిర్వర్తించిన బాధ్యతలు.. సంతృప్తినిచ్చిన అంశాలేమిటి జవాబు : దేశ ఆర్థిక రాజధాని ముంబయ్ మహానగరానికి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేశాను. అంతకుముందు అడిషనల్ కమిషనర్‌గా, ముంబయ్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ఆ సమయంలోనే ముంబయ్ నగరంలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టు ల నిర్మాణానికి నాంది పలికాను. మొదటి ముంబయ్ మెట్రో రైల్వే ప్రాజెక్టు మొదలు పెట్టింది నా ఆధ్వర్యంలోనే. 2000 సంవత్సరం నుంచి మూడేళ్లపాటు నాగపూర్ కమిషనర్‌గా పనిచేశాను. ఆ నగరాన్ని మహారాష్ట్రలోనే పరిశుభ్రమైన.. అందమైన నగరంగా తీర్చిదిద్దా. ఇందుకు ప్రతిఫలంగా అనేక పురస్కారాలు లభించాయి. అండర్ వరల్డ్ అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్న తరుణంలో థానే మహానగరానికి కమిషనర్‌గా పనిచేసి ఆ నగర ముఖచిత్రాన్ని మార్చగలి గాను. వాహనాల రద్దీ.. కాలుష్యంతో నిండిన నగరం హరిత నగరంగా మారింది. మంచినీటి సరఫరా పథకాలు, రోడ్ల నిర్మాణం, ఫై్ల ఓవర్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ వంటి 20 బృహత్తర పథకాలను అమలు చేశాను. ఆ సమయంలోనే థానే నగరం నుంచి బదిలీ అయ్యాను. నన్ను బదిలీ చేయవద్దంటూ ఆ నగర ప్రజలు మూడు రోజులపాటు బంద్ నిర్వహించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. సిటీ ఆఫ్ ఆరెంజస్ అని నాగపూర్‌కు పేరు. నాగపూర్ మునిసిపల్ కమిషనర్‌గా ఆ పేరును సార్థకం చేసేలా దానిని మహారాష్ట్రలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దా. నాగపూర్ అభివృద్ధిని చూసిన ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే నన్ను అభినందించడాన్ని గొప్పగా ఫీలవుతాను. 1995లో వెనుకబడిన ప్రాంతమైన రత్నగిరి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లలో దాని రూపురేఖల్ని మార్చాను. కళ్యాణ్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, సతారా జిల్లా పరిషత్ సీఈవోగా, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ముంబయ్ మురికివాడల పునరుద్ధరణ సంస్థ సీఈవోగా కూడా పనిచేశాను. మీకు లభించిన అవార్డులు జవాబు : ఐఏఎస్‌గా సమర్థవంతంగా పనిచేసినందుకు భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లభించింది. రాజీవ్‌గాంధీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్స్మ్ అవార్డు, జాయింట్స్ ఇంట ర్నేషనల్ పబ్లిక్ సర్వీస్ అవార్డు, ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక నుంచి లీడర్ షిప్ పురస్కారం, ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు, మహారాష్ట్ర భూషణ్ అవార్డు, పబ్లిక్ సర్వీస్ ఎక్స్‌లెన్స్ అవార్డు వంటివెన్నో వచ్చాయి. మీ లక్ష్యం ఏమిటి ? జవాబు : నాయకుడన్న పదానికి మహాత్మాగాంధీ ఇచ్చిన నిర్వచనం నిత్యం ప్రజలతో కలిసిమెలసి ఉండటం. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల ప్రయోజనాలను కాపాడేవాడే నిజమైన నాయకుడు. దీనికి నిజమైన అర్థం చెప్పేట్లుగా రెండు దశాబ్దాలకుపైగా ఐఏఎస్ అధికారిగా లక్షలాది ప్రజ లకు అందుబాటులో ఉండి నా బాధ్యత నిర్వర్తించాను. సమాజం మనకేం చేసింది అనే దానికన్నా మనం సమాజానికి ఏం చేశాం అని ఆలోచించాలి. ఇందుకోసమే మరింత విస్తృత స్థాయిలో సేవ చేయడానికి రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను. -
వారిద్దర్నీ గెలిపించుకుందాం : జగన్
ఏలూరు : ఐఏఎస్ అధికారిగా తోట చంద్రశేఖర్‌కు మంచి అనుభవం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అటువంటి అనుభవం ఉన్న నాయకుడినే పార్లమెంట్‌కు పంపేందుకు దీవించాలని ఆయన ప్రజలను కోరారు. కాగా ప్రస్తుతం తోట చంద్రశేఖర్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నారు. అలాగే మద్దాల రాజేష్ మీలో మనిషి అని, గతంలో ఎమ్మెల్యేగా చేసినా..... వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ప్రభుత్వం సహకరించకపోవటంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తోట చంద్రశేఖర్‌ను, మద్దాల రాజేష్‌ను గెలిపించి తిరిగి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆయన పేర్కొన్నారు. -
'సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్'
రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆ పార్టీ నాయకులు తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు అన్నారు. ఆదివారం ఏలూరులో తోట చంద్రశేఖర్, ఆళ్లనాని మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన నాయకత్వం అవసరమని తెలిపారు. కేంద్రంతో తలపడి రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కడే అని వారు స్పష్టం చేశారు. సోమ, మంగళవారాలలో పశ్చిమ గోదావరి జిల్లాలలో జగన్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు చంద్రశేఖర్, ఆళ్లనానిలు పిలుపునిచ్చారు. జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలతోపాటు 8 మున్సిపాలిటీలు, ఓ కార్పోరేషన్ మేయర్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. -
కిరణ్ రాజీనామాతో ప్రమోజనం లేదు-తోట
-
పార్టీ వీడే ప్రసక్తేలేదు: వైఎస్సార్సీపీ
ఆ పత్రిక కథనం అవాస్తవం, హాస్యాస్పదం: తోట చంద్రశేఖర్ 20, 30 ఏళ్లపాటు జగన్‌తోనే: బొడ్డు భాస్కర రామారావు సాక్షి, హైదరాబాద్: తాము పార్టీని వీడిపోతున్నామని ఒక పత్రికలో వచ్చిన కథనం అసత్యం, అవాస్తవం, హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిశీలకులు తోట చంద్రశేఖర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు స్పష్టంచేశారు. ఆ పత్రికలో ఇలాంటి కథనాలు రాసే ముందు మీడియా విలువలు పాటించి తమను కూడా వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడుతున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు. చంద్రశేఖర్ ఏమన్నారంటే... - పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి మేమంతా ప్రజల్లో విసృ్తతంగా తిరుగుతుంటే ఇలాంటి తప్పుడు కథనాలు రావడం విడ్డూరం. ఏలూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడింటికి ఏడు అసెంబ్లీ స్థానాలను గెల్చుకునే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. - ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు, పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు పనిగట్టుకుని తమ పార్టీలో నేతలకు గౌరవం లేదనే ప్రచారం చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. భాస్కరరామారావు ఏమన్నారంటే... - ‘మిడిల్ డ్రాప్’ అనే శీర్షికన వార్త ప్రచురించిన ఆ పత్రిక యజమానికి పేకాట బాగా అలవాటేమో, అందుకే అలాంటి వార్తలు రాస్తున్నారు. - రానున్న 20, 30 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే నా కుమారుడు వెంకటరమణ చౌదరి ఆ పార్టీలో చేరి విసృ్తతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. - నేను 1972 నుంచీ సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని. నాపై ఇలాంటి రాతలు రాయడమేంటి? - ఓ పత్రిక తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఓ చానెల్ తన రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే మా పార్టీ కార్యకర్తలు వాటి యాజమాన్యాలకు గుణపాఠం చెప్పే పరిస్థితి రానీయవద్దు. -
'ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు'
-
'ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు'
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించి తమపైనా, పార్టీపైనే బురద చెల్లించేందుకు కుట్ర పన్నిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, బొడ్డు భాస్కరరావు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ సీపీలో పలువురు నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతాననంటూ ఆ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని తోట చంద్రశేఖర్ అన్నారు. వైఎస్ఆర్ సీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ తరపునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతిలో ఇలాంటి కథనాలు రాసేముందు తమను సంప్రదించి ఉంటే బాగుండేదని తోట చంద్రశేఖర్ హితవు పలికారు. వైఎస్ఆర్ సీపీ నేత బొడ్డు భాస్కరరావు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రేటింగ్ పెంచుకోవడం కోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు విమర్శించారు. ఉభయగోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న వైఎస్ఆర్ సీపీ దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు. పొలిటికల్ ఎజెండాతో ఇలాంటి కథనాలు ప్రచురించడం వల్ల పత్రికల పట్ల విలువ ఉండదని బొడ్డు భాస్కరరావు పేర్కొన్నారు. -
'కిరణ్, చంద్రబాబులు తోడు దొంగలు'
రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరినట్లు అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని ఆయన వారిరువురిని డిమాండ్ చేశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలే బుద్ది చెప్పే రోజులు దెగ్గరలోనే ఉన్నాయిని చంద్రబాబుకు చంద్రశేఖర్ సూచించారు. -
విభజనతో సీమాంధ్ర అగ్నిగుండం: బాలరాజు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని వెల్లడించారు. పశ్చిమగోదావరిలో శుక్రవారం నిర్వహించిన బంద్‌కు బాలరాజు, తోట చంద్రశేఖర్‌లు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... విభజనతో సీమాంధ్ర ఎడారిగా మారుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విభజనపై బ్లాంక్ చెక్కులా కేంద్రానికి లేఖ ఇచ్చారు, అందువల్లే కాంగ్రెస్ పార్టీ విభజిస్తుందని ఆయన ఆరోపించారు. అటు తెలంగాణ ,ఇటు సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని బాలరాజు జోస్యం చెప్పారు. రాష్ట విభజనపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం సీమాంధ్రకు బ్లాక్ డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ తోట చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. సమన్యాయం అంటూ నాటకాలు ఆడిన చంద్రబాబు వెంటనే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు న్యాయం జరగలేదు కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా సమైక్య లేఖ ఇవ్వాలని హితవు పలికారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే విభజన ఆగుతుందని ఆయన తోట చంద్రశేఖర్ వెల్లడించారు. -
కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఎవరు ఇస్తారు?
విజయవాడ: రాష్ట్ర విభజన జరిగితే కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు ఎవరిస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. నూజివీడులో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజనతో హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కు ఉండదని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి, 10 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు 500 కోట్ల రూపాయల ప్యాకేజి కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. విభజన జరిగితే పోలవరం నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే కాంగ్రెస్ విభజన చేస్తోందని విమర్శించారు. విభజనను అడ్డుకునే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రమేనని చంద్రశేఖర్ అన్నారు. -
'ప్రధానిని నిర్ణయించే అధికారం వైఎస్సార్ సీపీకి వస్తుంది'
ప.గో:భవిష్యత్తులో దేశ ప్రధానిని నిర్ణయించే అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు జంగారెడ్డి గూడెంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన వైఎస్సార్ సీపీ గెలిచేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతా నిబద్ధతతో కృషి చేస్తే వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. అసలు బాబు.. సమైక్య రాష్ట్రానికి కట్టుబడ్డరా?లేక విభజనకు అనుకూలంగా ఉన్నరా?అనే అంశంపై ప్రజలకు స్పష్టమైన వైఖరి చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. -
'సమైక్య శంఖారావం' వల్లే మళ్లీ అఖిలపక్ష భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని మాజీ ఐఏఎస్ అధికారి, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు తోట చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం ఆయన ఏలూరులో విలేకర్లతో మాట్లాడుతూ... అందువల్లే కేంద్రం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు కోర్టు అనుమతించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి... వైఎస్ విజయమ్మ పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకున్నారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. గత నెల 26న సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ఆ సభకు హజరై విజయవంతం చేసిన సంగతి తెలిసిందే. -
విభజనను అడ్డుకునే శక్తి జగన్‌కే ఉంది
ఏలూరు సిటీ/ఆర్‌ఆర్‌పేట : రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఏలూరులో సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లపై నేతలు, కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వకర్తలతో కలసి గురువారం ఆయన సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలి సే రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా పావులు కదిపారని, తెలంగాణలో అయినా పార్టీని బతికిం చుకునేందుకు సీమాంధ్ర ప్రజల జీవితాలతో చెలగా టం అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 9, 10 సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం కాంగ్రెస్ కుటిలనీతికి నిదర్శనమన్నారు. ప్రజల భవిష్యత్‌తో ఆటలాడితే సహించేదిలేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర శంఖారావం పూరించారని చెప్పా రు. నిజాయితీ, నిబద్ధతతో సమైక్యాంధ్ర కోసం ఆయన పాటుపడుతున్నారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని 9కోట్ల మంది ప్రజల్లో ఐదున్నర కోట్లమంది విభజన వద్దని నినదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సాగునీటి సమస్య ఒక్కటే కాకుండా విద్య, వైద్యం వంటి అనేక విషయాల్లో ప్రజలు, విద్యార్థులు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో జాతీయస్థాయి విశ్వవిద్యాలయా లు, విద్యాసంస్థలు ఉన్నాయని, విభజనతో సీమాం ధ్ర విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశా రు. 2014 ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలోనే సంచలనం సృష్టిస్తాయని, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోవటం ఖాయమని ఘంటాపథంగా చెప్పారు. పార్లమెంటుకు విభజన బిల్లువస్తే తమ వాణి విని పించేందుకు అవకాశం ఉండదని సీమాంధ్ర ఎం పీలు ప్రజలను చివరి దశలోనూ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సీమాంధ్రలోని 19మంది ఎంపీలు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం వచ్చి బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. సమైక్య శంఖారావానికి భారీ ఏర్పాట్లు ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 35వేలకు పైగా ప్రజలను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని చంద్రశేఖర్ తెలి పారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5వేలకు పైగా ప్రజలు సభకు వస్తారన్నారు. ఇందు కోసం ఏలూరు నుంచి ఒక ప్రత్యేక రైలు, వందలాది వాహనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమైక్య శంఖారావ సభ దేశ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుందని, ఢిల్లీ పీఠాన్ని కదిలించి విభజన నిర్ణయాన్ని ఆపేందుకు వైఎస్ జగన్ చేపట్టిన సభకు అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు. అంతకుముందు జీతాలను వదులుకుని ఉద్యమం చేసిన న్యాయశాఖ ఉద్యోగులకు నిత్యావసర సరుకులను అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్ పంపిణీ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ శ్రేణుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌కుమార్, పార్టీ సమన్వయకర్తలు, నాయకులు పాల్గొన్నారు.