అభివృద్ధి చేసి చూపిస్తా
అభివృద్ధి చేసి చూపిస్తా
Published Sun, Mar 9 2014 2:47 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ప్రాంతాన్ని రాష్ట్ర చిత్రపటంలో ప్రముఖంగా నిలబెట్టేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశానని, ఎంపీగా ఎన్నికైన వెంటనే దానిని అమలు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, డెల్టా ఆధునికీకరణ, కొల్లేరు సహా ఆరు కీలక సమస్యలను తాను ప్రాధాన్యతా అంశాలుగా తీసుకున్నానని తెలి పారు. ఎంపీగా ఎన్నికైన మరుక్షణం వాటిపై పనిచేయడం మొదలు పెడతానన్నారు. ఐఏఎస్ అధికారిగా ముంబయ్ మహానగరంతోపాటు మహారాష్ట్రలో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. ఏలూ రు పరిసరాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయడం తన కర్తవ్యమని చెప్పారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో శనివారం ఆయనను ‘సాక్షి’ ఇంటర్య్వూ చేసింది.
ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగుతున్నారు.. మీ విజన్ ఏమిటి
జవాబు : అందరిలా ఎడాపెడా హామీలు ఇవ్వను. దూరదృష్టితో ఆలోచిస్తాను. విస్తృత అధ్యయనం తర్వాత ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశాను. అందులో కీలకమైన ఆరు అంశాలపై దృష్టి పెడతాను. రైతన్నల కలగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించడమే నా మొదటి లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే రెండు లక్షల మందికి పూర్తిస్థాయి పునరావాసం కల్పించే బాధ్యత ఉంది. దాన్ని ఎలా చేయాలనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంది. రెండోది భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైను. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తా. ఈ ప్రాజెక్టు వల్ల చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. మూడోది కొల్లేరు అంశం.
పర్యావరణ సమతుల్యతను సాధిస్తూనే ఇక్కడి ప్రజల హక్కులను కాపాడటం ఒక సవాల్. కాంటూరు పరిధిని మూడుకు తగ్గిస్తామని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. నాలుగోది చింతలపూడి ఎత్తిపోతల పథకం. దీన్ని పూర్తి చేయించే బాధ్యత కూడా తీసుకుంటా. డెల్టా రైతులకు మరణ శాసనంగా మారిన ముంపు సమస్యను పరిష్కరించే డెల్టా ఆధునికీకరణను పూర్తి చేయించడం నా విధి. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుగారి కంపెనీ నిర్మాణ పనులను చేజిక్కించుకుని ఆలస్యం చేసింది. అలాంటి వాటన్నింటినీ పరిష్కరించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేస్తా. ఏలూ రు నగరాన్ని అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. నగరానికి ముంపు సమస్య లేకుండా చేయడంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను పక్కాగా నిర్మింపచేస్తా. ఏలూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనేది నా ప్రధాన డిమాండ్. ఈ విషయాన్ని ఇప్పటికే మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిలో పెట్టా ను. రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు ఈ ప్రాంతానికి ఉన్నాయి. రెండు ఎయిర్‌పోర్టులు, రెండు పోర్టులతోపాటు అన్ని ప్రాంతాలను కలిపే రైలుమార్గం, జాతీయ రహదారి ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఇంతకంటే మెరుగైన ప్రాంతం మరొకటి లేదు. లక్షా 20 వేల మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలను క్రోడీకరించిన తర్వాతే ఈ లక్ష్యాలను మీకు చెబుతున్నా. నన్ను ఆదరించాలని అందరినీ కోరుతున్నాను.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఎలా ఉంది
జవాబు : కొంతకాలంగా వెలువడుతున్న అన్ని సర్వే ఫలి తాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెబుతున్నా యి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల తేడా ఉంది. జనం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకం పెట్టుకున్నారనడానికి ఈ సర్వేలే నిదర్శనాలు. కాంగ్రెస్, టీడీ పీ, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదు. వారి ఆశలన్నీ వైఎస్ జగన్‌పైనే ఉన్నాయి. ఆయన దృఢవైఖరి, పోరాటపటిమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోను, కేంద్రం లోను వైఎస్సార్ సీపీ కీలకం కాబోతోంది. రాష్ట్ర పునర్నిర్మాణం వైఎస్ జగన్‌మోహనరెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక విజన్ ఉన్న నాయకుడాయన. చంద్రబాబుకు అవకాశం ఇస్తే రెండు, మూడేళ్ల తర్వా త పరిస్థితి ఏమిటి. ఆయన వృద్ధాప్యంతో పక్కకు తప్పుకుంటే రాష్ట్రం ఏమవుతుంది. అందుకే యువకు డు, దూరదృష్టి ఉన్న వైఎస్ జగన్‌ను అందరూ ఆమోదిస్తున్నారు.
మీ విద్యాభాస్యం వివరాలు చెబుతారా
జవాబు : గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్, ముంబయ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొం దాను. సమాజానికి సేవ చేయాలంటే సివిల్ సర్వీసులే కీలకమని భావించాను. 1987లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను. ఐఏఎస్‌గా మహారాష్ట్రలో 22ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశా.
నిర్వర్తించిన బాధ్యతలు.. సంతృప్తినిచ్చిన అంశాలేమిటి
జవాబు : దేశ ఆర్థిక రాజధాని ముంబయ్ మహానగరానికి మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేశాను. అంతకుముందు అడిషనల్ కమిషనర్‌గా, ముంబయ్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ఆ సమయంలోనే ముంబయ్ నగరంలో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టు ల నిర్మాణానికి నాంది పలికాను. మొదటి ముంబయ్ మెట్రో రైల్వే ప్రాజెక్టు మొదలు పెట్టింది నా ఆధ్వర్యంలోనే. 2000 సంవత్సరం నుంచి మూడేళ్లపాటు నాగపూర్ కమిషనర్‌గా పనిచేశాను. ఆ నగరాన్ని మహారాష్ట్రలోనే పరిశుభ్రమైన.. అందమైన నగరంగా తీర్చిదిద్దా. ఇందుకు ప్రతిఫలంగా అనేక పురస్కారాలు లభించాయి. అండర్ వరల్డ్ అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్న తరుణంలో థానే మహానగరానికి కమిషనర్‌గా పనిచేసి ఆ నగర ముఖచిత్రాన్ని మార్చగలి గాను. వాహనాల రద్దీ.. కాలుష్యంతో నిండిన నగరం హరిత నగరంగా మారింది. మంచినీటి సరఫరా పథకాలు, రోడ్ల నిర్మాణం, ఫై్ల ఓవర్‌ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ వంటి 20 బృహత్తర పథకాలను అమలు చేశాను. ఆ సమయంలోనే థానే నగరం నుంచి బదిలీ అయ్యాను. నన్ను బదిలీ చేయవద్దంటూ ఆ నగర ప్రజలు మూడు రోజులపాటు బంద్ నిర్వహించడాన్ని ఇప్పటికీ మరచిపోలేను. సిటీ ఆఫ్ ఆరెంజస్ అని నాగపూర్‌కు పేరు. నాగపూర్ మునిసిపల్ కమిషనర్‌గా ఆ పేరును సార్థకం చేసేలా దానిని మహారాష్ట్రలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దా. నాగపూర్ అభివృద్ధిని చూసిన ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే నన్ను అభినందించడాన్ని గొప్పగా ఫీలవుతాను. 1995లో వెనుకబడిన ప్రాంతమైన రత్నగిరి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లలో దాని రూపురేఖల్ని మార్చాను. కళ్యాణ్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, సతారా జిల్లా పరిషత్ సీఈవోగా, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్‌గా, ముంబయ్ మురికివాడల పునరుద్ధరణ సంస్థ సీఈవోగా కూడా పనిచేశాను.
మీకు లభించిన అవార్డులు
జవాబు : ఐఏఎస్‌గా సమర్థవంతంగా పనిచేసినందుకు భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లభించింది. రాజీవ్‌గాంధీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్స్మ్ అవార్డు, జాయింట్స్ ఇంట ర్నేషనల్ పబ్లిక్ సర్వీస్ అవార్డు, ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక నుంచి లీడర్ షిప్ పురస్కారం, ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ అవార్డు, మహారాష్ట్ర భూషణ్ అవార్డు, పబ్లిక్ సర్వీస్ ఎక్స్‌లెన్స్ అవార్డు వంటివెన్నో వచ్చాయి.
మీ లక్ష్యం ఏమిటి ?
జవాబు : నాయకుడన్న పదానికి మహాత్మాగాంధీ ఇచ్చిన నిర్వచనం నిత్యం ప్రజలతో కలిసిమెలసి ఉండటం. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల ప్రయోజనాలను కాపాడేవాడే నిజమైన నాయకుడు. దీనికి నిజమైన అర్థం చెప్పేట్లుగా రెండు దశాబ్దాలకుపైగా ఐఏఎస్ అధికారిగా లక్షలాది ప్రజ లకు అందుబాటులో ఉండి నా బాధ్యత నిర్వర్తించాను. సమాజం మనకేం చేసింది అనే దానికన్నా మనం సమాజానికి ఏం చేశాం అని ఆలోచించాలి. ఇందుకోసమే మరింత విస్తృత స్థాయిలో సేవ చేయడానికి రాజకీయ రంగాన్ని ఎంచుకున్నాను.
Advertisement