
'కిరణ్, చంద్రబాబులు తోడు దొంగలు'
రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఏలూరు లోక్సభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరినట్లు అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని ఆయన వారిరువురిని డిమాండ్ చేశారు.
రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తావని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలే బుద్ది చెప్పే రోజులు దెగ్గరలోనే ఉన్నాయిని చంద్రబాబుకు చంద్రశేఖర్ సూచించారు.