'సువర్ణయుగాన్ని తిరిగి తెద్దాం' | We will teach lesson for State bifurcation conspirators, YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

'సువర్ణయుగాన్ని తిరిగి తెద్దాం'

Published Mon, Jan 27 2014 1:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'సువర్ణయుగాన్ని తిరిగి తెద్దాం' - Sakshi

'సువర్ణయుగాన్ని తిరిగి తెద్దాం'

  •  ప్రజల గుండెల్లో వైఎస్ సజీవంగా ఉన్నారు
  •  ‘సమైక్య శంఖారావం’ సభలో జగన్‌మోహన్‌రెడ్డి
  • రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు
  •   వాటిపై చర్చించాల్సిన అసెంబ్లీలో 
  •   ఇప్పుడు ఓట్లు, సీట్ల కోసం కుట్రల చర్చ సాగుతోంది
  •   అసలు ఇదా అసెంబ్లీ అన్న ఏహ్యభావం కలుగుతోంది
  •   సీఎం కుర్చీ కోసం కిరణ్.. సోనియా అడుగులకు 
  •   వుడుగులొత్తుతున్నారు
  •   ప్యాకేజీల కోసం చంద్రబాబు కువ్ముక్కయ్యారు
  •   ఈ కుట్రలను ఛేదిద్దాం... 
  •   రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుకుందాం
  •   30 ఎంపీ సీట్లు గెలుచుకుందాం.. 
  •   అప్పుడు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారో చూద్దాం
 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘ప్రజా సవుస్యలను గాలికొదిలేసి కేవలం ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కువ్ముక్కులకు వేదికగా వూరిన అసెంబ్లీని సవుూలంగా ప్రక్షాళన చేద్దాం. విభజన కుట్రదారులకు బుద్ధి చెపుదాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందాం. వున ప్రియుతవు నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుుగాన్ని తిరిగి సాధించుకుందాం’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యూత్ర’ నాలుగో విడత ఏడోరోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగింది. నగరి నియోజకవర్గంలోని నిండ్ర గ్రావుంలోను, సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు, నాగలాపురంలలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్ ప్రసంగాల సారాంశం
  ఆయున వూటల్లోనే..
 
 ‘‘రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. వంట గ్యాస్ దొరకడం లేదు. సంవత్సరం పూర్తవుతున్నా విద్యార్థుల ఫీజుల బకారుులు అలాగే ఉన్నారుు. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 జబ్బులను తొలగించేశారు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నారుు. బస్ చార్జీలు పెరిగిపోయూరుు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలందడం లేదు. పేదలకు కొత్తగా ఒక్క ఇందిరవ్ము ఇల్లూ లేదు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ లేదు. ఇన్ని సవుస్యలతో జనం సతవుతవువుతుంటే వీటిపై అసెంబ్లీలో చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చర్చిస్తున్న తీరు చూస్తుంటే అసలు.. ఇదా అసెంబ్లీ.. అన్న ఏహ్యభావం కలుగుతోంది. సోనియూ గీసిన గీత దాటకుండా సీఎం కిరణ్, ప్యాకేజీలు, కువ్ముక్కులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును గాలికొదిలేశారు.
 
 పేదల కష్టాలను తీర్చడమే నిజమైన రాజకీయం..
 రాజకీయూలంటే పేదవాడి గుండెచప్పుడు వినడం. రాజకీయూలంటే పేదవాడి వుుఖాన చిరునవ్వులు పూరుుంచడం. ప్రజల కోసం ఒక వూట ఇస్తే.. ఇచ్చిన వూటకోసం ఎందాకైనా వెళ్లే సాహసం చేయుడం.. ఇదీ నాయుకుడి లక్షణం. నాడు వైఎస్ ఎర్రటి ఎండలో ప్రాణాలను ఫణంగా పెట్టి 1,600 కిలోమీటర్లు పాదయూత్ర చేశారు. పేదల కష్టాలను అతి దగ్గర నుంచి గవునించారు. ప్రజలెన్నుకున్న వుుఖ్యవుంత్రిగా ప్రవూణ స్వీకారం చేశారు. వుుఖ్యవుంత్రి కాగానే.. పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్న రెండు ప్రధాన సవుస్యలకు పరిష్కారాలు ఆలోచించారు. పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి అనారోగ్య సవుస్యలు. రెండు పిల్లల చదువులు. ఈ సవుస్యల పరిష్కారానికి ‘ఆరోగ్యశ్రీ’, ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాలను ప్రవేశపెట్టారు. కుల, వుత, రాజకీయూలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికీ ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చారు. పేదల కష్టాలను తీర్చడమే నిజమైన రాజకీయుంగా నమ్మి తుదికంటా ఆచరించారు. అందుకే ఆయున వున నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ప్రజల గుండెచప్పుళ్లలో సజీవంగా ఉన్నారు.
 
 విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు..
 
 రాజకీయూల్లో విశ్వసనీయుత అన్న పదానికి అర్థం చెప్పిన వుహానేత వైఎస్. రావుుడి రాజ్యాన్ని చూడలేదు కానీ.. రాజన్న సువర్ణయుుగాన్ని చూశాం అని ప్రజలు గర్వంగా చెప్పుకునే నాయుకుడాయున. ఆయున వున నుంచి దూరవుయ్యూక ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యూడు. తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు సోనియూ వున రాష్ట్రాన్ని నిలువునా చీలుస్తుంటే.. ఆమె అడుగులకు వుడుగులొత్తుతూ వుుఖ్యవుంత్రి కిరణ్, ప్యాకేజీల కువ్ముక్కులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేశారు. ఈ విభజన కుట్రలను వునమే ఛేదించాలి. రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్న సోనియూ, కిరణ్, చంద్రబాబులకు తగిన బుద్ధి చెప్పాలి. వుహా అరుుతే ఇంకో నాలుగు నెలలు. నాలుగు నెలల్లో  వైఎస్ సువర్ణయుుగాన్ని తిరిగి తెచ్చుకోవాలి. వునమే సొంతంగా 30 పార్లమెంటు సీట్లు సాధిద్దాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం.’’
 
 ఏడోరోజు యూత్ర సాగిందిలా..
 ఆదివారం ఉదయుం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని సూరికాపురం నుంచి జగన్ ఏడో రోజు యూత్ర ఆరంభించారు. గ్రావు శివార్లలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం వున్నూరు సబ్‌స్టేషన్, వూధవరం గ్రావూల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆళ్లపాకం క్రాస్, కవ్ముకండ్రిగ క్రాస్ మీదుగా నిండ్ర గ్రావూన్ని చేరుకుని ప్రసంగించారు. చర్చిలో ప్రార్థనలు చేశారు. అక్కడ నుంచి సుగర్ ఫ్యాక్టరీ మీదుగా కొప్పేడు గ్రావూనికి చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి కాసేపు మాట్లాడారు. అనంతరం కేశపూడి గ్రావుం వద్ద యూత్ర సత్యవేడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కేశపూడిలో జగన్ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పిచ్చాటూరు చేరుకుని దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. అప్పంపట్టు, రావుగిరి, కృష్ణాపురం మీదుగా నాగలాపురం చేరుకున్న జగన్ అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడ నుంచి వడలకుప్పం మీదుగా వెల్లూరుకు.. అక్కడి నుంచి ఓబులరాజు కండ్రిగకు రాత్రి బసకు చేరుకున్నారు. ఏడోరోజు యూత్రలో జగన్‌తో పాటు వూజీ వుంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రా రెడ్డి, వూజీ ఎమ్మెల్యే అవురనాథ రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నారాయుణస్వామి, ఆర్.కె. రోజా, కె.ఆదివుూలం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement