శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.షష్ఠి రా.2.34 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం అశ్వని రా.9.50 వరకు తదుపరి భరణి, వర్జ్యం సా.5.31 నుంచి 7.14 వరకు
దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.28 వరకు అమృతఘడియలు... ప.2.08 నుంచి 3.46 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం:శుభవర్తమానాలు. అదనపు రాబడి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం.
వృషభం:బంధువులతో తగాదాలు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనుల్లో నిదానం అవసరం.
మిథునం:చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కళాకారులకు సన్మానాలు. నూతన ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో విజయం. సంఘంలో గౌరవం.
కర్కాటకం:నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత వృత్తి, వ్యాపారాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి.
సింహం:అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనుకున్న పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.
కన్య:కృషి చేసినా ఫలితం అంతగా కనిపించదు. పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులు, మిత్రులో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
తుల:విందువినోదాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం.
వృశ్చికం:నూతన విద్య, ఉద్యోగావకాశాలు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. కాంట్రాక్టర్లకు అనుకూలత. నూతన వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.
ధనుస్సు:సన్నిహితుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశ. వృత్తి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. ఆలయాల సందర్శనం. పనులు నిదానంగా పూర్తి కాగలవు.
మకరం:ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కళాకారులకు పర్యటనలు వాయిదా.
కుంభం:కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. సోదరులు, మిత్రుల నుంచి కీలక సందేశం. సన్మానయోగం. కీలక నిర్ణయాలు.
మీనం:కుటుంబసభ్యులతో వివాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment