Graham Gooch
-
WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023-England vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇంగ్లండ్ తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ధర్మశాల వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మలన్ విధ్వంసకర శతకం ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో అర్ధ శతకం(52), డేవిడ్ మలన్ సునామీ సెంచరీ(140)తో అద్భుత ఆరంభం అందించారు. ఈ క్రమంలో బెయిర్‌స్టో స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్.. 33.4 ఓవర్లో షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అదే జోష్‌లో అరుదైన ఘనత కూడా సాధించాడు. మరోసారి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే(35.4ఓవర్) రెండు పరుగులు తీసి.. గ్రాహం గూచ్ను అధిగమించాడు. తద్వారా వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1.జో రూట్- 898* 2.గ్రాహం గూచ్- 897 3.ఇయాన్ బెల్- 718 4.అలన్ లాంబ్- 656 5.గ్రేమ్ హిక్- 635. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో! -
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
ఒక బంతి.. 22 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే అదో చెత్త నిర్ణయంగా మిగిలిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌తో దురదృష్టానికి దగ్గరగా.. అదృష్టానికి దూరంగా నిలిచిపోయింది సౌతాఫ్రికా. నిషేధం తర్వాత ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆ మ్యాచ్ ఒక చీకటి రోజు. 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే లెక్కలు వేసి మరి దక్షిణాఫ్రికాను ఇంటి దారి పట్టేలా చేశారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది. మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను ఐసీసీ తొలగించింది. 1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమల్లోకి వచ్చింది. ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 ,1992న జరగ్గా.. సరిగ్గా నేటితో 30 ఏళ్లు పూర్తైంది. చదవండి: IPL 2022: టీమిండియా కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు ICC Womens WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే..? -
గ్రహం అనుగ్రహం(21-08-2019)
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బ.షష్ఠి రా.2.34 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం అశ్వని రా.9.50 వరకు తదుపరి భరణి, వర్జ్యం సా.5.31 నుంచి 7.14 వరకు దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.28 వరకు అమృతఘడియలు... ప.2.08 నుంచి 3.46 వరకు. సూర్యోదయం : 5.47 సూర్యాస్తమయం : 6.20 రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు భవిష్యం మేషం:శుభవర్తమానాలు. అదనపు రాబడి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం. వృషభం:బంధువులతో తగాదాలు.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనుల్లో నిదానం అవసరం. మిథునం:చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కళాకారులకు సన్మానాలు. నూతన ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో విజయం. సంఘంలో గౌరవం. కర్కాటకం:నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత వృత్తి, వ్యాపారాలలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. సింహం:అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. అనుకున్న పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. కన్య:కృషి చేసినా ఫలితం అంతగా కనిపించదు. పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులు, మిత్రులో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. తుల:విందువినోదాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం. వృశ్చికం:నూతన విద్య, ఉద్యోగావకాశాలు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. కాంట్రాక్టర్లకు అనుకూలత. నూతన వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ధనుస్సు:సన్నిహితుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశ. వృత్తి,వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు. ఆలయాల సందర్శనం. పనులు నిదానంగా పూర్తి కాగలవు. మకరం:ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కళాకారులకు పర్యటనలు వాయిదా. కుంభం:కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. సోదరులు, మిత్రుల నుంచి కీలక సందేశం. సన్మానయోగం. కీలక నిర్ణయాలు. మీనం:కుటుంబసభ్యులతో వివాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు.– సింహంభట్ల సుబ్బారావు -
సచిన్‌కే ఎక్కువ మంది ప్రత్యర్థులు!
సుదీర్ఘ కాలం టీమిండియాకు సేవలందించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించాకా మళ్లీ రికార్డులేంటని అనుకుంటున్నారా?. తాజాగా ఓ అధ్యయనం వెల్లడించిన కథనాల ప్రకారం సచిన్ ఆ కేటగిరిలోనూ టాప్‌గా నిలిచాడు. ఇప్పటికే అత్యధిక పరుగులు, సెంచరీలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్.. అత్యధిక మంది ఆటగాళ్లను ప్రత్యర్థులుగా ఎదుర్కొంది కూడా సచినే కావడం విశేషం. ఇక ఎక్కువ మంది సహచరులతో ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ మూడో స్థానంలో నిలిచాడు. అసలు విషయమేమిటంటే.. 24 సంవత్సరాల సుదీర్ఘ టెస్టు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్‌కు దిగ్గజ ఆటగాళ్లతో అదేవిధంగా యువ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం లభించింది. సచిన్ అలా 110 మంది టీమ్ మేట్స్‌ను కలిగి ఉండి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గ్రాహం గూచ్ (113), ఫ్రాంక్ వూలే(111) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో టీమిండియా మాజీ ఆటగాడు, అండర్ -19 కోచ్ రాహుల్ ద్రవిడ్(93) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక ఎక్కువ మంది ప్రత్యర్థి ఆటగాళ్లను ఎదుర్కొన్న జాబితాలో సచినే తొలి స్థానంలో నిలిచాడు. తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో 492 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను సచిన్ ఎదుర్కొన్నాడు. కాగా ఈ జాబితాలో వరుసగా వెస్టిండీస్ ఆటగాడు శివ్‌నారాయణ్ చంద్రపాల్(426), జాక్వస్ కల్లిస్(417), ముత్తయ్య మురళీధరన్(415), మహేలా జయవర్దనే(404)లు ఉన్నారు. -
‘విరాట్ డేంజరస్ బ్యాట్స్‌మన్’
లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌కు డేంజరేస్ బ్యాట్స్‌మన్ అని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రాహమ్ గూచ్ అభిప్రాయపడ్డాడు. భారత్-ఇంగ్లండ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం టాప్ ర్యాంకర్‌గా ఉన్న కోహ్లి ఇంగ్లండ్ జట్టుకు ప్రమాదకరమే. ఎందుకంటే అతను ఇంగ్లండ్‌లో తన రికార్డును మెరుగు పరుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రతి ఆటగాడికి విదేశాల్లో రాణించాలని ఉంటుంది.’ అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. కోహ్లి, జోరూట్‌ల శైలిపై స్పందిస్తూ.. ‘ ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రికెటర్ ఏ ఫార్మాట్ అయినా ఆకలింపు చేసుకుంటున్నాడు. వీరిలో ఎవరు గొప్ప అని చెప్పడం మాత్రం కష్టమే. ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. ఇద్దరి ఆటను ఆస్వాదించడానికి ఇష్టపడుతాను. పరుగులతో ఎవరు గొప్ప అని చెప్పలేము. పరిస్థితుల దగ్గట్టు ఆడినవారే గొప్పవారు. కొన్ని సందర్భాల్లో సెంచరీల కన్నా హాఫ్ సెంచరీలు కూడా కీలకం అవుతాయి.’ అని గ్రాహమ్ తెలిపాడు. చదవండి: పొరపాటు పడకోయి! -
'ఓపెనర్లలో అతనే బెస్ట్'
లండన్: గతవారం పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీ చేయడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ గ్రాహం గూచ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే కుక్ అత్యుత్తమ ఓపెనర్ అని కొనియాడాడు. పాకిస్థాన్ తో తొలి టెస్టు సందర్భంగా కుక్ 263 పరుగులు చేశాడు. సుదీర్ఘంగా 836 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి జట్టుకు కీలక ఇన్నింగ్స్ సాధించిపెట్టాడు. దీంతో అత్యధిక నిమిషాలు క్రీజ్ లో ఉన్న మూడో క్రికెటర్ గా కుక్ గుర్తింపు పొందాడు. కాగా, ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎక్కువ సమయం క్రీజ్ లో నిలిచిన తొలి ఆటగాడిగా కుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 'గొప్ప ఇన్నింగ్స్ లలో అదొక అత్యుత్తమ ఇన్నింగ్స్. కుక్ ఎప్పుడూ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. యుక్త వయసు నుంచి అతనికి ఆటపై ఏకాగ్రత అమోఘం. చాలా కాలం వరకూ ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఓపెనర్ గా కుక్ కొనసాగుతాడు' అని గూచ్ అభిప్రాయపడ్డాడు.