![Graham Gooch Says Virat Kohli Is A Dangerous Customer For England - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/29/Virat-Kohli.jpg.webp?itok=6lRxC1Kp)
విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో)
లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌కు డేంజరేస్ బ్యాట్స్‌మన్ అని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రాహమ్ గూచ్ అభిప్రాయపడ్డాడు. భారత్-ఇంగ్లండ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం టాప్ ర్యాంకర్‌గా ఉన్న కోహ్లి ఇంగ్లండ్ జట్టుకు ప్రమాదకరమే. ఎందుకంటే అతను ఇంగ్లండ్‌లో తన రికార్డును మెరుగు పరుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రతి ఆటగాడికి విదేశాల్లో రాణించాలని ఉంటుంది.’ అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
కోహ్లి, జోరూట్‌ల శైలిపై స్పందిస్తూ.. ‘ ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రికెటర్ ఏ ఫార్మాట్ అయినా ఆకలింపు చేసుకుంటున్నాడు. వీరిలో ఎవరు గొప్ప అని చెప్పడం మాత్రం కష్టమే. ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. ఇద్దరి ఆటను ఆస్వాదించడానికి ఇష్టపడుతాను. పరుగులతో ఎవరు గొప్ప అని చెప్పలేము. పరిస్థితుల దగ్గట్టు ఆడినవారే గొప్పవారు. కొన్ని సందర్భాల్లో సెంచరీల కన్నా హాఫ్ సెంచరీలు కూడా కీలకం అవుతాయి.’ అని గ్రాహమ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment