ఫైల్‌ఫోటో
సాక్షి, ముంబయి : వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్‌పై విచారణ జరిపించాలన్న తీవ్ర ఆర్థిక నేరాల విచారణ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) వినతిపై ప్రభుత్వం జాప్యం చేసిందని ఎస్‌ఎఫ్‌ఐఓ రాసిన లేఖలోని అంశాల ద్వారా వెలుగుచూసింది. ‘ ఈ ఉదంతంలో రూవేల కోట్ల ప్రజాధనం ముడిపడిఉన్నందున ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ చేపట్టడం మేల’ని ఫిబ్రవరి 27న ఎస్‌ఎఫ్‌ఐఓ ముంబయి బ్రాంచ్ న్యూఢిల్లీలోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ స్కామ్ వెలుగుచూసిన అనంతరం గత వారం సీబీఐ ప్రాధమిక దర్యాప్తునకు రంగంలోకి దిగినా ఎస్‌ఎఫ్‌ఐఓ వంటి ఇతర కీలక ఏజెన్సీలు ఇంకా అధికారిక గ్రీన్‌సిగ్నల్ కోసం వేచిచూస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం నెలకిందటే ఈ కేసులో ప్రాధమిక దర్యాప్తును పూర్తిచేసి ఉండవచ్చనేందుకు ఎస్‌ఎఫ్‌ఐఓ లేఖ విస్పష్ట సంకేతాలు పంపుతోంది.
వివిధ బ్యాంకు అక్రమాల కేసులను నిశితంగా పరిశీలించే ప్రధాని కార్యాలయంలో కీలకమైన నిపుణుడు అరవింద్ గుప్తా 2016లోనే ఈ కుంభకోణాన్ని పీఎంఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఐసీఐసీఐ వీడియోకాన్ అనుబంధంలో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లు, ఐసిఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై గుప్తా ఆరోపణలనే ఎస్‌ఎఫ్‌ఐఓ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్నతస్ధాయిలో భారీ కుంభకోణం వెలుగుచూసినా ఇప్పటికీ ఎస్‌ఎఫ్‌ఐఓ వర్గాలు హెడ్‌ఆఫీస్ నుంచి ఆదేశాల కోసం ఇంకా వేచిచూస్తున్నామని చెబుతున్నాయి.
కేసు పురోగతిపై ఎస్‌ఎఫ్‌ఐఓ ప్రధాన కార్యాలయం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను అందచేయాలని ఏడాది కిందటే తమ హెడ్‌ఆఫీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ (హెచ్‌ఐయూ) కోరిందని ఈడీ పేర్కొంటోంది. ఇంత జరిగినా అధికారిక దర్యాప్తు ఇంకా ప్రాధమిక దశలోనే మగ్గుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment