ఈ 120 షేర్లు- సాంకేతికంగా వీక్‌ | 120 Shares trading below 200 DMA | Sakshi
Sakshi News home page

ఈ 120 షేర్లు- సాంకేతికంగా వీక్‌

Published Thu, May 21 2020 12:25 PM | Last Updated on Thu, May 21 2020 1:06 PM

120 Shares trading below 200 DMA - Sakshi

గత నెలలో జోరు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యలు, లాక్‌డవున్‌ ఆంక్షల సడలింపులు సెంటిమెంటుకు బలాన్నివ్వడంతో మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ ‍ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 9,125 స్థాయిలో కదులుతోంది. అయితే నిఫ్టీ అటు దీర్ఘకాలిక, ఇటు స్వల్పకాలిక సగటు కంటే  దిగువనే కదులుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అంటే నిఫ్టీ 200 రోజులు, 50 రోజుల చలన సగటు(డీఎంఏ) లోపునే ఉంది. ఇదే విధంగా 200 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే దిగువన 120 స్టాక్స్‌ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో బ్లూచిప్‌ కౌంటర్లతోపాటు.. మిడ్‌ క్యాప్స్‌ సైతం చోటు చేసుకున్నాయి.సాంకేతిక నిపుణులు పేర్కొంటున్న ఇతర వివరాలు చూద్దాం..   

రూ. 10,000 కోట్ల విలువ
దీర్ఘకాలిక సగటుగా భావించే 200 రోజుల సింపుల్‌ మూవింగ్‌ ఏవరేజ్‌(ఎస్‌ఎంఏ) కంటే దిగువనే ఇప్పటికీ నిఫ్టీ కదులుతోంది. ఇదే విధంగా కనీసం రూ. 10,000 కోట్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) కలిగిన కంపెనీలను పరిగణిస్తే.. సుమారు 120 స్టాక్స్‌ 200 డీఎంఏ కంటే దిగువన ట్రేడవుతున్నాయి. కాగా.. నిఫ్టీ-50కి.. 200 డీఎంఏ 11,056 వద్ద, 50 డీఎంఏ.. 9199గా చార్టులు చూపుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 9125 స్థాయిలో కదులుతోంది. ఇది స్వల్ప బేరిష్‌నెస్‌ను సూచిస్తోంది. సాధారణంగా సాంకేతిక నిపుణులు 200 డీఎంఏను కీలకంగా భావిస్తుంటారు. 200 డీఎంఏ దిగువన కదులుతున్న కంపెనీల జాబితాలో దిగ్గజాలు టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌ తదితరాలున్నాయి. దీంతో సహజంగానే మార్కెట్ల స్ట్రక్చర్‌ బలహీనంగా ఉన్నట్లు శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మొహతా పేర్కొన్నారు.

జాబితా ఇలా 
200 డీఎంఏ దిగువన కదులుతున్న కంపెనీల జాబితాలో దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ సుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హిందుస్తాన్‌ జింక్‌, కోల్‌ ఇండియా, డాబర్‌, బజాజ్‌ ఆటో, పిడిలైట్‌, శ్రీ సిమెంట్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, హీరో మోటో, బెర్జర్‌ పెయింట్స్‌, మారికో, డీఎల్‌ఎఫ్‌ తదితరాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement