
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ విమాన ప్రయాణీకుల సంఖ్య శాతాల్లో అధికంగా ఉంది. జూన్‌లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 16.3 శాతం పెరిగింది. దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, టికెట్లను తక్కువ ధరలకు ఆఫర్ చేయడం వంటి అంశాలు ఇందుకు కారణమని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అభిప్రాయపడింది. ఇదే సమయంలో అంతర్జాతీయ దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 6.5 శాతం పెరిగింది.