21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్ | 21 billion in the mobile services market | Sakshi
Sakshi News home page

21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్

Published Thu, Aug 20 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్

21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ సర్వీసెస్ మార్కెట్ 21.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని గార్ట్‌నర్ పేర్కొంది. ట్యాబ్లెట్స్, నోట్‌బుక్స్ వంటి డేటా-సెంట్రిక్ పరికరాల్లో సెల్యులార్ సేవల వినియోగం పెరగటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మొబైల్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 4 శాతంగా ఉంటుందని అంచనా. డేటా సేవల వినియోగం పెరుగుదలతో మొబైల్ సేవల ఖర్చు 15 శాతం వృద్ధితో 6.5 మిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్‌లో గతేడాది 83 కోట్లుగా ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఈ ఏడాది 5 శాతం వృద్ధితో 88 కోట్లకు చేరుతుందని అంచనా. స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో వృద్ధి వంటి అంశాలూ డేటా సేవల ఖర్చు పెరుగుదలకు దోహదపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement