న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా(ఆర్‌ఐఐఎల్) కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 21 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.560 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.444 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం 14 శాతం వృద్ధితో రూ.2,654 కోట్లకు పెరిగిందని పేర్కొంది.