డాలర్ కలలు కంటూ... అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ప్రధాన మార్గం హెచ్-1బీ వీసా. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ వీసాలపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్-1బీ వీసాల ఆమోదం కూడా భారతీయ ఐటీ కంపెనీలకు తగ్గిపోతోంది. 2015 నుంచి 2017 వరకు దేశీయ ఐటీ కంపెనీలకు 43 శాతం హెచ్-1బీ వీసాల ఆమోదం తగ్గిపోయినట్టు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్‌ఎఫ్‌ఏపీ) పేర్కొంది. అయితే ఆమోదం పొందిన వాటిలో ఏ ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసాలు జారీ అయ్యాయో తెలుపుతూ అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెబ్‌సైట్ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 ఐటీ కంపెనీలకు ఎక్కువ హెచ్-1బీ వీసాలు జారీ అయినట్టు తెలిసింది. ఆ కంపెనీలేమిటి? ఏ మొత్తంలో ఆ కంపెనీలు వేతనాలను ఆఫర్ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం...
- కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికా కార్పొరేషన్, మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 28,908, సగటు వేతనం 85,429 డాలర్లు.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 14,697, సగటు వేతనం 73,505 డాలర్లు.
- ఇన్ఫోసిస్ లిమిటెడ్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 13,408, సగటు వేతనం 85,717 డాలర్లు.
- విప్రో లిమిటెడ్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 6,529, సగటు వేతనం 75,082 డాలర్లు.
- డెలాయిట్ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌పీ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 6027, సగటు వేతనం 106,797 డాలర్లు.
- అసెంచర్ ఎల్‌ఎల్‌పీ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 5070, సగటు వేతనం 83,573 డాలర్లు.
- టెక్ మహింద్రా : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4931, సగటు వేతనం 78,443 డాలర్లు.
- అమెజాన్.కామ్ కార్పొరేట్ ఎల్‌ఎల్‌సీ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4767, సగటు వేతనం 118,637 డాలర్లు.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4392, సగటు వేతనం 87,978 డాలర్లు.
- మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్స్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4069, సగటు వేతనం 130,259 డాలర్లు.
- క్యాప్‌జెమిని అమెరికా ఇంక్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 3580, సగటు వేతనం 84,667 డాలర్లు.
- ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 3000, సగటు వేతనం 79,916 డాలర్లు.
- గూగుల్ ఇంక్ : మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 2986, సగటు వేతనం 134,419 డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment