దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా లాభాల్లో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 26 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్‌కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, బ్రైట్‌కమ్ గ్రూప్, బయోకాన్, సిప్లా, డిజిస్పైస్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబొరేటరీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యూకంప్ సొల్యూషన్స్, ఎరీస్ లైఫ్‌సైన్సెస్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్, క్యాపస్టన్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్, డీఎస్‌పీ లిక్విడ్ ఈటీఎఫ్, లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్, మార్క్‌సాన్స్ ఫార్మా,ఆఫ్టో సర్య్కూట్స్(ఇండియా)లు ఉన్నాయి.
కనిష్టానికి నాలుగు
ఎన్‌ఎస్‌ఈలో 4 షేర్లు మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో కండావాల సెక్యూరిటీస్, కృష్ణా ఫోస్కేమ్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్, రాజ్ రెయాన్ ఇండస్ట్రీలు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 1 గంట ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ1.4 శాతం లాభంతో 144 పాయింట్లు పెరిగి 9,970.20 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్ 1.5శాతం లాభపడి 508.81 పాయింట్లు పెరిగి 33,812.33 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment