బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 23 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, ఆల్‌కెమిస్ట్, అలోక్ ఇండస్ట్రీస్, బ్రైట్‌కామ్ గ్రూప్, బిర్లా టైర్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డిజి స్పైస్ టెక్నాలజీస్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా), ఎడ్యుకంప్ సొల్యూషన్స్, ఎస్కార్ట్స్,జీఎంఎం ఫాడ్‌ల్లర్, గొయంక డైమండ్ అండ్ జువెల్స్, లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్, మర్క్‌సన్స్ ఫార్మా, ఆఫ్టో సర్య్కూట్స్(ఇండియా), ప్రకాశ్ స్టీలేజ్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్, ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్‌లు ఉన్నాయి. కాగా గత రెండురోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండడంతో నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ మాత్రమే 52 వారాల కనిష్టానికి పతనమైంది. నిఫ్టీ50 ఇండెక్స్‌లో మొత్తం 39 షేర్లు గ్రీన్,11 షేర్లు రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో భాగమైన బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్‌సర్వ్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌లు టాప్ గెయినర్‌లుగా ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్, విప్రో, ఎన్‌టీపీసీ, టీసీఎస్, కోల్ ఇండియాలు రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యహ్నాం 1:10 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 1.3 శాతం లాభంతో 137.05 పాయింట్లు పెరిగి 10.116.15 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్ 1.2 శాత లాభపడి 430.97 పాయింట్ల పెరుగదలతో 34,256.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment