క్యూ4 ఫలితాలు: ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గుజరాత్ గ్యాస్,ఇన్ఫీబీమ్, జ్యోతి ల్యాబొరేటరీస్, ఐఆర్‌బీ ఇన్విట్ ఫండ్, స్నోమాన్ లాజిస్టిక్స్, ఆర్‌ఈసీ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించనున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్: అబుదాబికి చెందిన సావరిన్ ఇన్వెస్టర్ ముబదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ రూ.9,093.6 కోట్లు వెచ్చించి జియో ప్లాట్‌ఫామ్స్‌లోని 1.85 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
డీఎల్‌ఎఫ్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.1,857.76 కోట్లుగా నమోదైనట్లు రియల్టీ మేజర్ డీఎల్‌ఎఫ్ వెల్లడించింది.
ఎన్‌ఐఐటీ: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 97 శాతం తగ్గి రూ.0.6 కోట్లుగా నమోదైందని ఎన్‌ఐఐటీ తెలిపింది.
భారతీ ఇన్‌ఫ్రాటెల్: ఇండస్ టవర్స్‌ను తమ కంపెనీలో కలుపుకునే అంశంపై నిర్ణం తీసుకునేందుకు భారతీ ఇన్‌ఫ్రాటెల్ బోర్డు జూన్ 11న సమావేశం కానుంది. ఈ టవర్ల కంపెనీనీ సొంతం చేసుకోవడం ద్వారా 1,69,000 టవర్లతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటిగా నిలవనుంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: గూగుల్ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీ ప్రకటించింది.
కాస్మో ఫిల్మ్స్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24.37 శాతం తగ్గి రూ.20.85 కోట్లుగా నమోదైనట్లు కాస్మో ఫిల్మ్స్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.27.57 కోట్లుగా ఉన్నట్లు బీఎస్‌కీ ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment