న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సంబంధించి లాక్‌డౌన్ అమలవుతుండటంతో రిటైల్ రంగంలో సుమారు 80,000 దాకా ఉద్యోగాలకు కోత పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న స్థాయి రిటైలర్లు.. తమ సిబ్బంది సంఖ్యను 30 శాతం దాకా తగ్గించుకోనున్నారు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 3,92,963 మంది సిబ్బంది ఉన్న 768 మంది రిటైలర్లతో ఆర్‌ఏఐ ఈ సర్వే నిర్వహించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారి వ్యాపారాలు, మానవ వనరులపై ప్రభావాల గురించి అభిప్రాయాలు సేకరించి, నివేదిక రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment