ముంబై: వ్యక్తిగత స్నేహాన్ని బ్యాంకింగ్ విధులకు దూరంగా ఉంచుకోవాలని తన సహచరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి సూచించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు గతంలో రుణ అభ్యర్థనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఒక బ్యాంకర్ ఏ వ్యక్తితోనైనా కలసి కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత అతడు కోరుకున్నది చేయవచ్చు’’ అని చెబుతూ, తన చిరకాల సహోద్యోగి అయిన పరేష్ సుక్తాంకర్ గుర్తించి తెలియజేశారు. గతంలో విజయ్‌మాల్యాకు రుణ అభ్యర్థనను తిరస్కరించినది ఆయనే. ‘‘మీ సమాచారం కోసమే చెబుతున్నాను. వారు (మాల్యా ఉద్యోగులు) రుణం కోసం నా దగ్గరకు వచ్చారు. నేను వారికి కాఫీ అందించి, వారి అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పా. ఆ తర్వాత పరేష్ దాన్ని తోసిపుచ్చాడు’’ అని ఆదిత్య పురి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment