
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం భారత ఎయిర్ కార్గో రంగంలో టాప్–10 ఎయిర్‌లైన్స్ హవా నడుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ సరుకు రవాణా విషయంలో వీటి వాటా ఏకంగా 65 శాతమని విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు.
ఈ విమానాశ్రయాలపై భారం తగ్గించడానికి చిన్న విమానాశ్రయాల నుంచి సరుకు రవాణాను ప్రోత్సహిస్తామని చెప్పారు. ‘ఎయిర్ కార్గో దేశంలో ఏటా 15% వృద్ధి చెందుతోంది. వార్షికంగా 3.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. వ్యవసాయ, ఆహార, ఫార్మా, చర్మ సంబంధ ఉత్పత్తులు, వస్త్రాలు వీటిలో అధికం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment