jayanth sinha
-
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్‌కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్‌కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్‌ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్ నోటీసులు
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. -
Cryptocurrency: క్రిప్టోకి అనుమతులు వచ్చేనా ? కేంద్రం వరుస సమావేశాలు!
Crypto Finance: క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా ? క్రిప్టో కరెన్సీకి అనుమతులు జారీ చేస్తూనే చట్టబద్ద నియంత్రణ ఉండేలా ఏర్పాట్టు చేయబోతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రిప్టోపై ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జయంత్‌సిన్హా నేతృత్వంలో క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ పరంగా నిర్ణయం ప్రకటించే ముందు ఇందులో భాగస్వాములగా ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిప్టో ఎక్సేంజీ ప్రతినిధులు, బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ), ఇండస్ట్రీ బాడీస్‌తో పాటు ఈ లావాదేవీలతో సంబంధం ఉండే ఇతర వర్గాలతో పార్లమెంటరీ ప్యానెల్ సోమవారం సమావేశం కానుంది. దీనికి మాజీ ఆర్థిక మంత్రి, పార్లమెంట్ సభ్యుడు జయంత సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ సమీక్ష ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మరోసారి ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) కమిటీ సమీక్షిస్తుంది. అనంతరం క్రిప్టోకి సంబంధించిన అంశం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. అక్కడ క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇవ్వాలా ? ఇస్తే ఎలాంటి చట్టపరమైన షరతులు విధించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నలువైపులా ఒత్తిడి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక్కటైన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి అనుమతులు ఇవ్వాలంటూ ప్రప్రంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు చట్టపరమైన అనుమతులు లేకపోయినా దేశంలో క్రిప్టో లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో భవిష్యత్తుపై చర్చించేందుకు ఇప్పటికే ఓ దఫా మంత్రులు, ఆర్బీలతో చర్చలు పూర్తయ్యాయి. ఆ సమావేశంలో చర్చించినట్టుగా క్రిప్టో కరెన్సీలో భాగస్వామ్య పక్షాలు, మేనేజ్మెంట్ సంస్థల అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది ప్రభుత్వం. ఆర్బీఐ నుంచి క్రిప్టోకరెన్సీపై సుప్రీం కోర్టు నిషేధం కొనసాగుతోంది. అయితే మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నేరుగా డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. కాగా ప్రస్తుతం క్రిప్టోపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి:క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం -
నినాదం కాదు... సర్వజన ‘వికాసం’
ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి ఎన్నికై రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలల్లో ‘సబ్ కా వికాస్’, ‘అందరి వికాసమే’ ఆయన ప్రాధాన్యమని నిరూపించారు. పాలనకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ, అవి ఉద్దేశించిన పేద, బలహీన వర్గాల వారికీ మరింత లబ్ధి చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారు. ‘సబ్కా సాథ్’ (అందరితో కలిసి) ‘సబ్కా వికాస్’ (అందరి వికాసం) – ఈ నినాదానికి ‘సబ్కా విశ్వాస్’ (అందరి విశ్వాసం) జోడించడం ద్వారా, అందరి అభివృద్ధికీ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ద్వారా, మన ప్రాణాలు కాపాడే సైనికుల శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలిసింది. జాతీయ భదత్రా నిధి కింద ప్రధాన మంత్రి ఉపకార వేతనాల పథకంలో, మార్పులను ఆమోదించారు. ఉపకార వేతనాల కింద ఇచ్చే మొత్తాన్ని బాగా పెంచారు. అంతేగాక, ఈ పథకాన్ని రాష్ట్ర పోలీసు ఉద్యోగుల పిల్లలకూ, నక్సల్స్ దాడుల్లో చనిపోయిన పోలీసుల పిల్లలకు కూడా వర్తింపజేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు కానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రతి గ్రామీణ కుటుంబానికీ విద్యుత్తు, వంటగ్యాస్ కనెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకుం టోంది. ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’ కింద గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్ధిదారులకు 1.96 కోట్ల గృహాలు నిర్మించనున్నారు. ‘ఉజ్వల యోజన’ కింద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల ధర భరించలేని వారికి 5 కేజీల గ్యాస్ సిలిండర్లు అందజేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జల జీవన్ మిషన్ ద్వారా పరిశుభమ్రైన త్రాగునీరు– హర్ నవ్ సే జల్ – ప్రతి పంపు నుంచీ నీరు, 2024 నాటికి అన్ని గ్రామాలలోనూ అందించనున్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశంలోని 256 జిల్లాలలోని 1,592 బ్లాకులలో, ప్రజల భాగస్వామ్యంతో జల్ శక్తి అభియాన్ కృషి చేస్తుంది. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, మొదటి కేబినెట్ సమావేశంలోనే "ప్రదాన్ కిసాన్ యోజన’ను 14.6 కోట్ల రైతులకు వర్తింపజేసి, ఐదు కోట్ల అన్నదాతలకు రూ. 10,000 కోట్ల పెన్షన్ పథకాన్ని రూపొందించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ‘జీరో బడ్జెట్ ఫార్మింగ్’ను ప్రవేశపెట్టారు. సన్నకారు రైతులను ఆదుకోవడానికి తక్కువ వడ్డీకి రుణాలు లభ్యమై, ఎక్కువ ధరకు అమ్ముకొనే వీలు కల్పిస్తూ, రైతుల ఉత్పత్తి సంఘాల ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. కేంద్రప్రభుత్వం ‘ప్రధాన్ శ్రమ యోగి మంథన్ యోజన’ పేరిట ఒక నూతన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా, దాదాపు 3 కోట్ల చిన్న దుకాణదారులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికీ నెలకు రూ. 3,000 లభిస్తాయి. మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణ లభ్యత పెంచడానికి ప్రత్యేక ఆన్ లైన్ పోర్టల్ ద్వారా 59 నిమిషాలలో కోటి రూపాయల రుణం లభ్యమయ్యేలా చర్యలు తీసుకొన్నారు. జీఎస్టీ కింద నమోదైన అన్ని మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు 2 శాతం వడ్డీకి కొత్త రుణాలు అందజేయడానికి రూ. 350 కోట్లు కేటాయించారు. ఈ పరి శ్రమలు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఒక ప్రత్యేక ప్లాట్ఫారంను రూపొందిస్తున్నారు. ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’ ద్వారా గ్రామీణ రోడ్లను గ్రామీణ్ అగ్రికల్చర్ మార్కెట్స్ (గ్రామ్స్)ను, ఆసుపత్రులను, పాఠశాలలను కలుపుతూ, 1.25 లక్ష కిలోమీటర్ల రోడ్లను మెరుగుపరుస్తారు. ఇప్పుడు 97 శాతం గ్రామాలలో అన్ని వాతావరణాలనూ తట్టుకొనే రహదారులు నిర్మించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోడ్ల అభివృద్ధితో దేశంలో రవాణా సౌకర్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలతోపాటు పాఠశాలలో హాజరు శాతం పెరి గింది. ఇళ్ళలో జరిగే ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం.‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదమే కాదనీ, భారతీయులందరికీ లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశించినదనీ స్పష్టమైంది. మన దేశంలో 2006–2016 మధ్య 27 కోట్ల జనాభా దారిద్య్ర రేఖకు ఎగువకు వచ్చారని తెలుస్తోంది. అత్యంత పేదరికంలో ఉన్నవారి సంఖ్య 7 కోట్లకు మించదు. మన దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తున్న వేళ పేదరికాన్ని నిర్మూలించనున్నాము. అతి త్వరలో ప్రతి భారతీయుడికీ ఒక ఇల్లు, సరిపడ ఆహారం, పరిశుభ్రమైన త్రాగునీరు, మరుగుదొడ్డి, ఆరోగ్య సౌకర్యం, ఉచిత విద్య, వంట గ్యాస్, విద్యుత్ సౌకర్యం, మొబైల్ ఫోను, మంచి రహదారులూ, బ్యాంకు అకౌంటు ఉంటుంది. మోదీ ప్రభుత్వం ప్రజలకు గౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందిస్తోంది. ఇదే అన్నింటికంటే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జయంత్ సిన్హా -
ఆటో కన్నా విమాన చార్జీలే నయం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలే చౌకగా ఉన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఆటో రిక్షాలో కిలోమీటర్‌కు రూ . 5 వరకూ చార్జ్ చేస్తుండగా, విమానాల్లో కిలోమీటర్‌కు రూ. 4 మాత్రమే వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న క్రమంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్‌ల సమిష్టి నష్టాలు రూ 12,000 కోట్ల వరకూ ఉంటాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ వంటి సంస్ధలతో పాటు అన్ని ఎయిర్లైన్లు ఇంధన ధరల భారం, తక్కువ ప్రయాణ చార్జీలతో కుదేలవుతున్నాయి. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్ ధరలను పెంచకపోవడం ఎయిర్‌లైన్స్ నష్టాలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో మినహా అన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. -
నిందితులను సన్మానించిన కేంద్ర మంత్రి..!
సాక్షి, న్యూఢిల్లీ: గోవు మాంసం విక్రయిస్తున్నాడనే అనుమానంతో గతేడాది జూన్‌లో అలీముద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని ఉరి వేసి చంపారు. రామ్‌ఘర్‌లోలో జరిగిన ఈ ఘటనలో 11 మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ జార్ఖండ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పుకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు నిందితులందరికీ బెయిలు మంజూరు చేసింది. అయితే కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హత్య కేసులోని 8 మంది నిందితులకు శుక్రవారం హజారీబాగ్‌లోని తన ఇంటిలో పూల మాలలు వేసి సన్మానం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సిన్హాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించిన జయంత్ తీరు మరీ అధ్వానంగా ఉందనీ జార్ఖండ్ ప్రతిపక్ష నేత హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్‌లు మండిపడ్డారు. మత విద్వేశాల్ని రెచ్చగొట్టే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర మంత్రి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై జయంత్ సిన్హా శనివారం స్పందించారు. రాజకీయ పరిపక్వత లేనివారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందనీ, హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. సిన్హా హర్వార్డ్ బిజినెస్ స్కూల్లో పట్టభద్రులు కావడం గమనార్హం. -
బెయిల్‌పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్‌పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
చిన్న విమానాశ్రయాల నుంచి కార్గో: జయంత్ సిన్హా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం భారత ఎయిర్ కార్గో రంగంలో టాప్–10 ఎయిర్‌లైన్స్ హవా నడుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ సరుకు రవాణా విషయంలో వీటి వాటా ఏకంగా 65 శాతమని విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఈ విమానాశ్రయాలపై భారం తగ్గించడానికి చిన్న విమానాశ్రయాల నుంచి సరుకు రవాణాను ప్రోత్సహిస్తామని చెప్పారు. ‘ఎయిర్ కార్గో దేశంలో ఏటా 15% వృద్ధి చెందుతోంది. వార్షికంగా 3.7 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. వ్యవసాయ, ఆహార, ఫార్మా, చర్మ సంబంధ ఉత్పత్తులు, వస్త్రాలు వీటిలో అధికం’ అని చెప్పారు. -
అని, అనలేదని అనడం ఆయనకే చెల్లు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి నోరు జారడంపై వివాదం రగులుతోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అనాలోచితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సర్దుకోలేక సతమతమవడం మోహన్ భాగవత్‌కు మొదటి నుంచి అలవాటే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోహన్ భాగవత్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. బీసీలు ఎక్కువగా ఉన్న బీహార్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల బీసీలు దూరమయ్యారని, పర్వవసానంగా ఎన్నికల్లో గెలవాల్సింది, ఓడిపోయామని బీజేపీ వర్గాలు ఇప్పటికీ వాదిస్తాయి. మొన్న ఆదివారం నాడు కూడా ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలల కాలం పడుతుందని, అదే ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలని అన్నారు. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌సైనికులు, టెర్రరిస్టులను తరచూ ఎదుర్కొంటూ భారత సైనికులు అసువులు భాస్తున్న సమయంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయి. జరిగిన నష్టాన్ని గ్రహించి తర్వాత ఆరెస్సెస్ ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. మీడియానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించినట్లుగా పేర్కొంది. ‘భారత సైన్యాన్ని ఆయన అవమానపర్చలేదు. ఇతర భారతీయులకన్నా ఆరెస్సెస్ మంచి క్రమశిక్షణగల వారని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చింది. ‘భారత రాజ్యాంగం అనుమతిస్తే పౌర సమాజాన్ని యుద్ధానికి సన్నద్ధం చేయడానికి సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు కనుక మూడు రోజుల్లోనే యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు’ అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారని ఆరెస్సెస్ నాయకుడు మన్మోహన్ వైద్య వివరణ ఇచ్చారు. భారత సైన్యంతో ఆరెస్సెస్‌ను ఆయన పోల్చలేదని, సాధారణ పౌర సమాజంతో, ఆరెస్సెస్ కార్యకర్తలను పోల్చారని, ఇరువురికి శిక్షణ ఇవ్వాల్సింది సైన్యమేనని వైద్య చెప్పుకొచ్చారు. ఆయనే కాకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా వెనకా ముందు ఆలోచించకుండా మోహన్ భాగవత్ ‘అలా’ అనలేదంటూ వివరణలు ఇచ్చారు. మరి ‘ఎలా’ అన్నారో ఆయన ప్రసంగం వీడియో టేపును చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది కదా! -
ఎయిరిండియా ఆపరేటింగ్ లాభాలు రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా తన పనితీరును నిలకడగా మెరుగుపరుచుకుని రెట్టింపు లాభాలను సాధించింది. రూ .298.03 కోట్లనిర్వహణ లాభాలను సాధించిందని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.105కోట్లుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే నికర నష్టాలు మరింత ఎగిసి రూ.5765కోట్లుగా నమోదయ్యాయి. 2015-16 నాటికి నికర నష్టం రు. 3,836.77 కోట్లు. ఎయిర్ ఇండియా భారతదేశంలో మొత్తం ఆర్థిక, కార్యాచరణ పనితీరును మెరుగుపరుచుకుంటోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా గురువారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. టర్నరౌండ్ ప్రణాళికలో భాగంగా, ఎయిర్ ఇండియా మార్గాలను హేతుబద్ధీకరించడం , విస్తరణకోసం వివిధ చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. ఎయిర్ ఇండియా స్పెషల్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఎఐఎస్ఎంఎం) బిడ్డింగ్ ఆహ్వాన ప్రతిపాదనల డ్రాఫ్ట్ ను ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా ఎయిర్ ఇండియా మ్యూజియం ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. -
నాలుగు కంపెనీలుగా ఎయిరిండియా
న్యూఢిల్లీ : నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాను అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మకానికి ముందే ఎయిరిండియాను నాలుగు కంపెనీలుగా విడదీయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇలా విడదీసిన ప్రతి కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కింద కనీసం 51 శాతం ఆఫర్ చేయాలని చూస్తుందని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్, రీజనల్ ఆర్మ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఇంజనీరింగ్ ఆపరేషన్లుగా విడదీయాలని ప్రభుత్వం చూస్తుందని రిపోర్టు పేర్కొంది. కోర్ ఎయిర్‌లైన్ బిజినెస్‌ల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, లో-కాస్ట్ ఓవర్సీస్ ఆర్మ్ ఉండనుంది. 2018 చివరి వరకు ఈ ప్రక్రియ ముగియనుందని జూనియర్ ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇటీవలే ఎయిరిండియాలో విదేశీ కంపెనీలు 49శాతం పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిరిండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపాదించిన వాటాల విక్రయ ప్రక్రియకు తుది విధివిధాలను మంత్రుల గ్రూప్ నిర్ణయిస్తోంది. త్వరలోనే బిడ్డర్లను కూడా ఆహ్వనించనున్నట్టు తెలుస్తోంది. కాగ, 55 వేల కోట్లతో ఎయిరిండియా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పటికే రూ.23 వేల కోట్లను భరించింది. -
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించనుంది. దేశీయ విమానయాన సంస్థల్లో టికెట్ల రద్దు సమయంలో విధించే చార్జీల సవరణకు కసరత్తు చేస్తోంది. దీనికి బదులు సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ విమానయాన సంస్థలు కాన్సిలేషన్ ఫీజు రూ. 3వేల చొప్పున వసూలు చేస్తున్న నేపథ్యంలో కాన్సిలేషన్ చార్జీల డేటా పంపించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కోరింది. తాజా నివేదికల ప్రకారం, రద్దు ఛార్జీలు బేస్ ఫేర్ కన్నా లేదా ఇంధన సర్ ఛార్జ్ మొత్తం కంటే ఎక్కువగా ఉండరాదు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునేలా నియమాలను రూపొందించనున్నట్టు సమాచారం. ఇటీవల కాన్సిలేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలకు దిగనుంది. కాగ ఉడాన్(తక్కువ ధరల్లో విమాన ప్రయాణ) పథకం గంటకు రూ. 2500 విమాన టికెట్లను అందిస్తోంటే.. దానికంటే కాన్సిలేషన్ చార్జీలు అధికంగా ఉండడంపై ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈ రద్దు ఛార్జీలను తిరిగి నియంత్రించాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటిని సమీక్షించాలని జయంత్ సిన్హా ఆదేశించారు. -
అమ్మకానికి ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: భారీ నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను వదిలించుకోవాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని కొనుగోలు చే సే సమర్థులను చూసి అమ్మేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శనివారం తెలిపారు. ఎయిర్ ఇండియా విక్రయాన్ని గత పాతికేళ్లుగా అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కేంద్రం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా విషయంలో నిర్ణయం ఇప్పటికే జరిగి పోయిందని, దీన్ని ఎలా అమలు చేయలాన్న విషయమే పెండింగ్‌లో ఉందని, దీనిపై కేబినెట్ సమావేశమై విధి విధానాలను ఖరారు చేస్తుందని జయంత్ సిన్హా వివరించారు. నరేంద్ర మోదీ ఈ మూడేళ్ల కాలంలో తీసుకున్న అతి భారీ నిర్ణయం ఇదే కావచ్చు. ఈ ప్రక్రియ మొత్తం 12 నెలల్లో ముగుస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ 52 వేల కోట్ల నష్టాల్లో ఉంది. నష్టాలతో ఎవరూ కొనడానికి ముందుకు రారుకనుక నష్టాలను పూర్తిగా మాషీ చేసి అమ్మేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనా. ఎయిర్ ఇండియాను ప్రైవేటుకు అప్పగించినట్లయితే బాగా నడుస్తుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందే నీతి అయోగ్ అని దాని సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఒక్క 2016–17 సంవత్సరంలోనే ఎయిర్ ఇండియాకు 3,643 కోట్ల రూపాయలు నష్టపోయింది, ఎయిర్ ఇండియాను కొనాలనువాళ్లు దానికి అనుబంధంగా నడుస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అలయెన్స్ ఎయిర్ సంస్థలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
రెవెన్యూ లోటు కింద ఏపీకి 500 కోట్లు ఇచ్చాం
- ఎంపీలు మేకపాటి, వైవీ, గల్లా ప్రశ్నలకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చేందుకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి సాయం కింద 2014-15 నుంచి 2018-19కి రూ.24,350 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నం దున కేంద్రం నుంచి సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం కోరిందా? కోరితే ఎంతమేరకు కేంద్రం సాయం చేసింది? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం రెవెన్యూ లోటు భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారు?’-అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి జయంతి సిన్హా పైవిధంగా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఏపీకి సంబంధించిన 2014-15 రెవెన్యూ లోటు అంశాన్ని పరిశీలిస్తోందని, ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇవి కాకుండా మరో రూ.350 కోట్లు ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్టు పేర్కొన్నారు.