అమ్మకానికి ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: భారీ నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను వదిలించుకోవాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని కొనుగోలు చే సే సమర్థులను చూసి అమ్మేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శనివారం తెలిపారు. ఎయిర్ ఇండియా విక్రయాన్ని గత పాతికేళ్లుగా అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు కేంద్రం నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎయిర్ ఇండియా విషయంలో నిర్ణయం ఇప్పటికే జరిగి పోయిందని, దీన్ని ఎలా అమలు చేయలాన్న విషయమే పెండింగ్‌లో ఉందని, దీనిపై కేబినెట్ సమావేశమై విధి విధానాలను ఖరారు చేస్తుందని జయంత్ సిన్హా వివరించారు. నరేంద్ర మోదీ ఈ మూడేళ్ల కాలంలో తీసుకున్న అతి భారీ నిర్ణయం ఇదే కావచ్చు. ఈ ప్రక్రియ మొత్తం 12 నెలల్లో ముగుస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ 52 వేల కోట్ల నష్టాల్లో ఉంది. నష్టాలతో ఎవరూ కొనడానికి ముందుకు రారుకనుక నష్టాలను పూర్తిగా మాషీ చేసి అమ్మేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనా.
ఎయిర్ ఇండియాను ప్రైవేటుకు అప్పగించినట్లయితే బాగా నడుస్తుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందే నీతి అయోగ్ అని దాని సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ఒక్క 2016–17 సంవత్సరంలోనే ఎయిర్ ఇండియాకు 3,643 కోట్ల రూపాయలు నష్టపోయింది, ఎయిర్ ఇండియాను కొనాలనువాళ్లు దానికి అనుబంధంగా నడుస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అలయెన్స్ ఎయిర్ సంస్థలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.