పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ | Airtel plans to list 500 million pound bond issue on London Exchange | Sakshi
Sakshi News home page

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

Published Sat, Nov 14 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

పౌండ్ల రూపంలో బాండ్ల జారీకి ఎయిర్‌టెల్ రెడీ

బాండ్ల విలువ రూ.5,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.5,000  కోట్ల(50 కోట్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్) స్టెర్లింగ్ బాండ్‌లను జారీ చేయనున్నది. ఈ బాండ్లను లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేస్తామని ఎయిర్‌టెల్ గ్రూప్ కోశాధికారి హర్జిత్ కోహ్లి చెప్పారు. ఈ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన మొత్తంతో ప్రస్తుతమున్న రుణాలను రీ ఫైనాన్స్ చేస్తామని చెప్పారు.

అంతర్జాతీయంగా రుణ పరిస్థితులు, మార్కెట్ల స్థితిగతులు వంటి అంశాలతో పాటు వివిధ సంస్థల నుంచి అనుమతులు రావల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఈ బాండ్లు ఎప్పుడు జారీ చేసేదీ వెల్లడిస్తామని  తెలిపారు. ఇప్పటికే డాలర్లు, యూరోలు, క్రోనార్ కరెన్సీల్లో బాండ్లను జారీ చేశామని, ఈ బాండ్‌లను సింగపూర్, ఫ్రాంక్‌ఫర్ట్, స్విట్జర్లాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్ చేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement