ముంబై : అన్నీ మంచి శకునాలే అంటూ పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ చివరిలో చేతులెత్తేశాయి. కొనుగోళ్ల వెల్లువతో సోమవారం ఇంట్రాడేలో 1300 పాయింట్లు పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆపై 153 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు బయటపడటంతో ట్రేడింగ్ చివరిలో మార్కెట్ కుప్పకూలింది. వైరస్ భయాలతో అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు పతనాల బాట పట్టాయి. ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ర్టీస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంతో 38,144 పాయింట్ల వద్ద ముగియగా, 69 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,132 పాయింట్ల వద్ద క్లోజయింది.
Comments
Please login to add a commentAdd a comment