గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బీట్ చేసింది. గూగుల్ బీట్ చేసిన ఈ కంపెనీ అమెరికా లిస్టెడ్ కంపెనీల్లో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అమెజాన్, ఆల్ఫాబెట్ గూగుల్‌ను బీట్ చేయడం ఇదే తొలిసారి. అమెజాన్ షేర్లు 2.69 శాతం పెరగడంతో, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 768 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అయితే ఇదే సమయంలో ఆల్ఫాబెట్ షేర్లు 0.39 శాతం నష్టపోయాయి. దీంతో ఆల్ఫాబెట్ గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 762 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
గత ఏడాదిగా అమెజాన్ స్టాక్ 81 శాతం పెరిగింది. తన కంప్యూటింగ్ ఆపరేషన్లను క్లౌడ్‌లోకి మార్చడంతో, ఈ కంపెనీ వేగంగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు కూడా మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. కాగ, ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా 889 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఆపిల్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీ షేర్లు 25 శాతం పెరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఆపిల్ స్టాక్ పెరిగితే, ఆపిల్ మార్కెట్ క్యాప్ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకనుంది.
Comments
Please login to add a commentAdd a comment