Most Valuable Company
-
మార్కెట్ క్యాప్‌లో నెం.1గా యాపిల్
ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది. కరోనా కల్లోల సమయంలోనూ కంపెనీ అదిపోయే క్యూ2 ఫలితాలను ప్రకటించింది. మెరుగైన ఫలితాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ షేరు 10శాతానికి పైగా లాభపడి 425.04 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సౌదీ ఆరామ్కో మార్కెట్ క్యాప్‌ను అధిగమించి 1.82 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాదిలో స్టాక్ మార్కెట్లో లిస్టైన సౌదీ ఆరాంకో మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటికి 1.76ట్రిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో టెక్నాలజీ షేర్లకు భారీగా డిమాండ్ నెలకొంది. యాపిల్ షేరు ఏడాది మొత్తం మీద 45శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికం సందర్భంగా దాదాపు 6తర్వాత యాపిల్ కంపెనీ షేర్ల విభజనకు ఆమోదం తెలిపింది. ఈ ఆగస్ట్ 31 తరువాత 1:4 విభజిస్తారు. ఈ జూన్ కార్వర్ట్‌లో యాపిల్ కంపెనీ 16బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సరికి 4.33బిలియన్ల అవుట్‌స్టాడింగ్ షేర్లు ఉన్నట్లు నాస్డాక్ ఎక్చ్సేంజ్ గణాంకాలు చెబుతున్నాయి. -
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా అమెజాన్
గ్లోబల్ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సారధ్యంలోని అమెజాన్ తాజాగా ప్రపంచంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. టాప్ ప్లేస్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్‌ను వెనక్కి నెట్టి సోమవారం ఈ ఘనతను సాధించింది. జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ రిటైల్ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి, ఈ భూమిపై అత్యంత విలువైన సంస్థగా మారింది. మంగళవారం గ్లోబల్ మార్కెట్లు ముగిసే సమయానికి అమెజాన్ షేరు మరో 10శాతం ఎగిసి, అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 810 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 57 లక్షల కోట్లు) గా నమోదైంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన కంపెనీగా అమెజాన్ నిలిచింది. ఇది సమీప కంపెనీ మైక్రోసాఫ్ట్ సంపద 790 బిలియన్ డాలర్లతో పోలిస్తే 20 బిలియన్ డాలర్లు ఎక్కువ. మరోవైపు చైనా దెబ్బతో యాపిల్ మరింత పడిపోయింది. ఒకపుడు1.1 ట్రిలియన్ డాలర్లు అధిగమించిన యాపిల్ మార్కెట్ క్యాప్, ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి 35 శాతానికి పైగా దిగజారింది. యాపిల్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ 710 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది. 750 బిలయన్ డాలర్లతో గూగుల్ ( మాతృసంస్థ ఆల్ఫాబెట్ ) మూడవ స్థానంలో ఉంది. జెఫ్ బెజోస్ నేతృత్వంలో అమెజాన్ రిటైల్ రంగంలో, ఆన్ లైన్ సేవలతో దూసుకుపోతోంది. 2013లో అమెజాన్ రెవిన్యూ 74.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2018 చివరి నాటికి కంపెనీ ఆదాయం 177.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం చివరినాటికి అది 232.2 బిలియన్ డాలర్లుకు పెరగవచ్చని గ్లోబల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
గూగుల్‌ను బీట్ చేసిన అమెజాన్
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బీట్ చేసింది. గూగుల్ బీట్ చేసిన ఈ కంపెనీ అమెరికా లిస్టెడ్ కంపెనీల్లో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. అమెజాన్, ఆల్ఫాబెట్ గూగుల్‌ను బీట్ చేయడం ఇదే తొలిసారి. అమెజాన్ షేర్లు 2.69 శాతం పెరగడంతో, ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 768 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అయితే ఇదే సమయంలో ఆల్ఫాబెట్ షేర్లు 0.39 శాతం నష్టపోయాయి. దీంతో ఆల్ఫాబెట్ గూగుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 762 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాదిగా అమెజాన్ స్టాక్ 81 శాతం పెరిగింది. తన కంప్యూటింగ్ ఆపరేషన్లను క్లౌడ్‌లోకి మార్చడంతో, ఈ కంపెనీ వేగంగా రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. అమెజాన్ వెబ్ సర్వీసులు కూడా మార్కెట్లో ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. కాగ, ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా 889 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ఆపిల్ మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీ షేర్లు 25 శాతం పెరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఆపిల్ స్టాక్ పెరిగితే, ఆపిల్ మార్కెట్ క్యాప్ తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకనుంది. -
టీసీఎస్‌ను బీట్ చేసిన బ్యాంకింగ్ దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న టెక్ దిగ్గజం టీసీఎస్‌ను, ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధిగమించింది. మార్కెట్ విలువలో రెండో అత్యంత విలువైన కంపెనీగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు అవతరించింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,73,530.72 కోట్లకు ఎగిసింది. ఇది టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే రూ.797.4 కోట్లు ఎక్కువ. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.4,72,733.32 కోట్లగా ఉంది. బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.93 శాతం పైకి జంప్‌చేసి 52 వారాల గరిష్టంలో ట్రేడవుతున్నాయి. టీసీఎస్ కూడా 0.36 శాతం లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ, ఈ కంపెనీని హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ దిగ్గజం అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు సుమారు 53 శాతం పైకి ఎగియగా.. టీసీఎస్ 5 శాతం మేర లాభపడింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.5,33,818.72 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌లున్నాయి.