బీజింగ్: అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. చైనాకు చెందిన ఉత్పత్తులపై అమెరికా నూతనంగా పెంచిన టారిఫ్‌లకు స్పందనగా... అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల దిగుమతులపై అదనపు టారిఫ్‌లను బీజింగ్ అమలు చేస్తుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ప్రకటించింది. అలాగే, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు మరో ప్రకటన కూడా వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment