
వైజాగ్‌లో మరో ఆసుపత్రి: అపోలో
న్యూఢిల్లీ: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఈ ఏడాది మరో రెండు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించనుంది. ఇవి వైజాగ్‌తోపాటు నవీ ముంబైలో రానున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటితోపాటు కొత్త ఆసుపత్రుల ద్వారా వచ్చే అయిదేళ్లపాటు ఏటా 1,000 పడకలు జోడించనున్నట్టు చెప్పారు. వైజాగ్‌లో ఇప్పటికే అపోలో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తోంది.