'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి | Apple case against Samsung should go back to lower court: Justice Dept | Sakshi
Sakshi News home page

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి

Published Thu, Jun 9 2016 11:37 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి - Sakshi

'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి

శామ్ సంగ్ పై యాపిల్ పెట్టిన కేసు విచారణను తిరిగి కింద కోర్టుకు బదలాయించాలని అమెరికా సుప్రీంకోర్టును ఆ దేశ న్యాయశాఖ కోరింది. స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై నడుస్తున్న ఈ కేసుపై మరింత విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తున్నందున్న దీన్ని ట్రయల్ కోర్టుకు పంపాలని న్యాయశాఖ అడుగుతోంది. 

2011 నుంచి  స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై ఈ రెండు దిగ్గజాల మధ్య వార్ నడుస్తోంది. ఐఫోన్ పేటెంట్లను, డిజైన్లను, ట్రేడ్ మార్క్ లను శామ్ సంగ్ ఉల్లఘించిందని ఆరోపణలు చేస్తూ.. శామ్ సంగ్ పై  యాపిల్ పేటెంట్ దావా వేసింది. 2012లో తొలిసారి విచారణకు వచ్చిన ఈ దావా కేసులో, జ్యూరీ ట్రయల్ యాపిల్ కు 9300లక్షల డాలర్లు చెల్లించాలని శామ్ సంగ్ కు ఆదేశాలు జారీచేసింది.

ఆ మొత్తాన్ని తగ్గించాలని అప్పటినుంచి శామ్ సంగ్ అమెరికా కోర్టులో పోరాటం చేస్తోంది. శామ్ సంగ్ ప్రయత్నాలు కొంత అనుకూలించి 2015 మే లో ఈ మొత్తాన్ని 5480లక్షల డాలర్లకు అమెరికా కోర్టు తగ్గించింది. అయితే పేటెంట్ డిజైన్ పైనా, అధికమొత్తంలో విధించిన పేటెంట్ దావా జరిమానపై పునఃవిచారణ చేపట్టాలని కోరుతూ శామ్ సంగ్ సుప్రీంకోర్టు గడపతొక్కింది. డిజైన్ పేటెంట్లను ఉల్లంఘించినప్పుడు కేవలం ఆ ఉత్పత్తి మొత్తం లాభాల్లోంచే నష్టపరిహారం చెల్లించేలా కోర్టులు ఆదేశించాలని శామ్ సంగ్ సుప్రీంను కోరింది.

అదీకూడా ఆ పేటెంట్ కేవలం ప్రొడక్ట్ కాంపొనెంట్లకే చెందుతుందని వాదిస్తోంది. అయితే శామ్ సంగ్ వాదనలను అమెరికా కోర్టు తోసిపుచ్చింది. ఆ కేసును ట్రయల్ కోర్టుకు సుప్రీం బదలాయించాలని, ఈ విషయంపై కొత్తగా విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తోందని న్యాయశాఖ పేర్కొంది. అయితే శామ్ సంగ్ వాదిస్తున్న వాదనలపై స్పందించడానికి యాపిల్ అధికార ప్రతినిధి తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement