lower court
-
మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్ కుమార్– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్ – ముంబై, వారీస్– బిహార్.. వేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది. హత్య కేసు వివరాలు.. వివరాలు.. వారిస్, తుషార్ రాజస్థాన్‌లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు తుషార్ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్‌ను కిడ్నాప్ చేయాలని వారిస్ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్‌కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు. జనవరి 16న అతని తండ్రికి కాల్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తుషార్ తండ్రి బిహార్ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. (చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర ) -
'యాపిల్' కేసును కింది కోర్టుకు పంపండి
శామ్ సంగ్ పై యాపిల్ పెట్టిన కేసు విచారణను తిరిగి కింద కోర్టుకు బదలాయించాలని అమెరికా సుప్రీంకోర్టును ఆ దేశ న్యాయశాఖ కోరింది. స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై నడుస్తున్న ఈ కేసుపై మరింత విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తున్నందున్న దీన్ని ట్రయల్ కోర్టుకు పంపాలని న్యాయశాఖ అడుగుతోంది. 2011 నుంచి స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై ఈ రెండు దిగ్గజాల మధ్య వార్ నడుస్తోంది. ఐఫోన్ పేటెంట్లను, డిజైన్లను, ట్రేడ్ మార్క్ లను శామ్ సంగ్ ఉల్లఘించిందని ఆరోపణలు చేస్తూ.. శామ్ సంగ్ పై యాపిల్ పేటెంట్ దావా వేసింది. 2012లో తొలిసారి విచారణకు వచ్చిన ఈ దావా కేసులో, జ్యూరీ ట్రయల్ యాపిల్ కు 9300లక్షల డాలర్లు చెల్లించాలని శామ్ సంగ్ కు ఆదేశాలు జారీచేసింది. ఆ మొత్తాన్ని తగ్గించాలని అప్పటినుంచి శామ్ సంగ్ అమెరికా కోర్టులో పోరాటం చేస్తోంది. శామ్ సంగ్ ప్రయత్నాలు కొంత అనుకూలించి 2015 మే లో ఈ మొత్తాన్ని 5480లక్షల డాలర్లకు అమెరికా కోర్టు తగ్గించింది. అయితే పేటెంట్ డిజైన్ పైనా, అధికమొత్తంలో విధించిన పేటెంట్ దావా జరిమానపై పునఃవిచారణ చేపట్టాలని కోరుతూ శామ్ సంగ్ సుప్రీంకోర్టు గడపతొక్కింది. డిజైన్ పేటెంట్లను ఉల్లంఘించినప్పుడు కేవలం ఆ ఉత్పత్తి మొత్తం లాభాల్లోంచే నష్టపరిహారం చెల్లించేలా కోర్టులు ఆదేశించాలని శామ్ సంగ్ సుప్రీంను కోరింది. అదీకూడా ఆ పేటెంట్ కేవలం ప్రొడక్ట్ కాంపొనెంట్లకే చెందుతుందని వాదిస్తోంది. అయితే శామ్ సంగ్ వాదనలను అమెరికా కోర్టు తోసిపుచ్చింది. ఆ కేసును ట్రయల్ కోర్టుకు సుప్రీం బదలాయించాలని, ఈ విషయంపై కొత్తగా విచారణ చేపట్టాల్సిన అవసరం వస్తోందని న్యాయశాఖ పేర్కొంది. అయితే శామ్ సంగ్ వాదిస్తున్న వాదనలపై స్పందించడానికి యాపిల్ అధికార ప్రతినిధి తిరస్కరించారు.