న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఈ నెల 3వ వారం నుంచీ తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థిక శాఖ కార్యాలయానికి రాలేదు. అప్పుడప్పుడూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం కోలుకుంటోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పోర్టిఫోలియో లేనప్పటికీ క్యాబినెట్ మంత్రిగానే ఆయన కొనసాగుతున్నందువల్ల, ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పనిఉండదు. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయితే సరిపోతుందని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి.
Comments
Please login to add a commentAdd a comment