న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక లాంచ్ చేసిన పథకం అటల్ పెన్షన్ యోజన. 60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీనిని 2015-16 బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఈ పథకం కింద ఇక నుంచి నెలకు 10 వేల రూపాయలు పొందవచ్చు. ఈ పరిమితిని 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద నెలకు 5000 రూపాయల వరకే ప్రభుత్వం ఆఫర్ చేసేది. అనధికారిక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పెన్షన్ స్కీమ్‌న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం కనుక అమల్లోకి వస్తే, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, గడువు అనంతరం నెలకు 10వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు. అటల్ పెన్షన్ యోజన కింద అందించే పెన్షన్ విలువ పెరగాల్సి ఉందని ఆర్థిక సేవల డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ మాద్నెష్ కుమార్ మిశ్రా చెప్పారు. పెన్షన్ రెగ్యులేటరీ పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
నెలకు పెన్షన్‌ను రూ.10వేల వరకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద నెలకు అందించే పెన్షన్ ఐదు శ్లాబుల్లో ఉంది. ఈ విషయంపై మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, 60 ఏళ్ల తర్వాత అందించే రూ.5000 పెన్షన్, వచ్చే 20-30 ఏళ్లకు సరిపోదని పేర్కొన్నట్టు మిశ్రా చెప్పారు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. మూడు రకాల పద్ధతుల్లో ఏపీవైకి చెల్లించవచ్చు. ఒకటి నెలవారీ, రెండు త్రైమాసికం, మూడు అర్థ సంవత్సరంలో ఈ పెట్టుబడులు పెట్టవచ్చు. పెన్షన్ పెంపుతో పాటు మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పెన్షన్ రెగ్యులేటరీ, ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపింది. ఏపీవైకి ఆటో ఎన్‌రోల్‌మెంట్, ఈ స్కీమ్‌లో ప్రవేశానికి గరిష్ట వయసును 50 ఏళ్ల వరకు పెంచడం. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 40 ఏళ్లే గరిష్ట వయసుగా ఉంది. మరో 10 ఏళ్ల పెంపుతో సబ్‌స్క్రైబర్ బేస్‌ను మరింత పెంచవచ్చని పెన్షన్ రెగ్యులరీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్ పథకానికి 1.02 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2017-18లో కొత్తగా 50 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment