ఇక ఆడి ఏ8ఎల్ అదుర్స్ | audi a8l car remould by unknown person instruction | Sakshi
Sakshi News home page

ఇక ఆడి ఏ8ఎల్ అదుర్స్

Published Wed, Apr 13 2016 4:01 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

ఇక ఆడి ఏ8ఎల్ అదుర్స్ - Sakshi

ఇక ఆడి ఏ8ఎల్ అదుర్స్

ముంబయి: ఓ అజ్ఞాత వినియోగదారుడి సలహా.. ఆడి ఏ8ఎల్‌ కంపెనీ యాజమాన్యానే కదిలించింది. విశాలంగా, పెద్దదిగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో ఆ కంపెనీ ఏ8ఎల్‌ ను ఆరు డోర్లుగా పొడిగించి, కస్టమరే కింగ్‌ అని నిరూపించింది. ఈ లగ్జరీ కార్లో ఇప్పుడు ఆరుగురు వ్యక్తులు కూర్చొనే సౌకర్యం ఉంటుంది. 20.9 అడుగులాల వెడల్పు, 13.8 అంగుళాల వీల్‌ బేస్‌గా దీన్ని పొడిగించారు. కారులోని ఏపిల్లర్‌ నుంచి బ్యాక్‌ఎండ్‌ వరకూ ఉన్న ప్రతిభాగాన్ని మళ్లీ పునరుద్ధరించారు.

లీమోజీన్‌ కారు సీట్లలాగా ప్రస్తుతం మార్పులు చేసిన ఏ8ఎల్‌ కారు సీట్లు కనిపించనున్నాయి. మూడో వరుస సీట్లకు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ డిస్‌ ప్లే, రీఫ్రిజిరేటెడ్‌ స్టోరేజ్‌ బాక్స్, రెండు మూడు వరుస సీట్లు వాల్కానో లెదర్‌ తో పవర్‌ సర్దుబాటు చేసుకునే విధంగా రూపొందించారు. 7.1 సెకండ్లలో 62 మైల్స్‌ను వెళ్లే సామర్థ్యం ఈ కారుకు ఉంది. ఆడీ ఏ8ఎల్‌ కారుకు పైన గ్లాస్‌ ప్యానెల్‌ను అమర్చారు. దీనివల్ల సూర్యకాంతి నుంచి తప్పించుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ పొడిగించిన కారు పరిమాణం తక్కువ బరువుతో ఉండి చాలావరకూ అల్యూమినియంతో రూపొందినదై ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ ఆఫర్‌ చేస్తున్న ఈ మోడల్ కారు మార్కెట్లో ఆరు డోర్ల లగ్జరీ సెడాన్‌ గా పేరొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement