కీలక విదేశీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలకమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు బిడ్డింగ్ చేసే దేశీ కంపెనీలకు రాయితీపై రుణాలు అందించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ రుణాల రీపేమెంటుకు సదరు దేశ ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద దేనికి రాయితీ రుణం అందించవచ్చన్నది ఆయా ప్రాజెక్టును బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంకు కాకుండా ఇతరత్రా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా వ్యూహాత్మక ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే యోచనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. రెండేళ్ల తర్వాత ఈ స్కీమును పునఃసమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.