ముంబై : కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అవసరమైన చర్యలు ప్రకటిస్తారనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాట పట్టాయి. బ్యాంక్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎల్‌అండ్‌టీ, యస్ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభపడుతున్నాయి.
జీఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్‌బీఎల్ బ్యాంక్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 41,344 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 49 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,156 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment