ఒక్క రోజులో 23 ఏపీజీవీబీ శాఖలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్(ఏపీజీవీబీ) తన బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఒక్క రోజులో 23 కొత్త బ్యాంక్ శాఖలను ప్రారంభించింది. ఈ 23 శాఖలను ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ హరదయాళ్ ప్రసాద్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రారంభించారని ఏపీజీవీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాల ప్రారంభించడం మరింత సులభం చేసే ఈ-కేవైసీ, మొబైల్ ఏటీఎంలను కూడా ఆయన ప్రారంభించారని పేర్కొంది. ఏపీజీవీబీ ప్రారంభమై పదేళ్లైందని, ఈ పదేళ్లలో ఈ బ్యాంక్ పలు అద్భుతాలను సాధించిందని ఈ సందర్భంగా హర్‌దయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,300 కోట్ల వ్యాపారాన్ని సాధించామని ఏపీజీవీబీ చైర్మన్ వి. నరసి రెడ్డి తెలిపారు.