సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానమంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో పట్ట పగలే నిలువు దోపిడీ జరుగుతోందట. ఇందుకు సంబంధించిన ఓ విషయాన్ని తెలుపుతూ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన ప్రతాప్ బోస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల జీఎస్టీ పన్ను శాతాన్ని 18 నుంచి 5 శాతానికి తగ్గించారని, అయితే జీఎస్టీని తగ్గించిన తర్వాత కూడా అదే రెస్టారెంట్లో బిల్లులో మాత్రం ఏ మార్పు లేదని ప్రతాప్ బోస్ గుర్తించారు. 'జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. కానీ బిల్లులో మాత్రం ఏ తేడా లేదు. పట్ట పగలే దోచుకుంటున్నారని' బిల్లుకు సంబంధించిన ఫొటోను అటాచ్ చేస్తూ ట్వీట్ చేశారు. మెక్‌డోనాల్డ్స్, అరుణ్ జైట్లీ పేర్లను ట్యాగ్ చేస్తూ జరుగుతున్న మోసాన్ని ప్రతాప్ బోస్ వారి దృష్టికి తీసుళ్లారు. జీఎస్టీ 18శాతం ఉన్న నవంబర్ 7న, జీఎస్టీ 5 శాతానికి తగ్గిన తర్వాత నవంబర్ 15న కూడా బిల్లు రూ.142 కావడం గమనార్హం.
GST reduced from 18% to 5% but the bill amount remains exactly the same ... Robbery in broad daylight @mcdonaldsin @arunjaitley pic.twitter.com/prFGetPtOw
— Pratap Bose (@pratap_bose) 16 November 2017
Comments
Please login to add a commentAdd a comment