
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) షేరు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈలో బీపీసీఎల్ షేరు 3.2 శాతం నష్టపోయి రూ.337.65 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం ఫలితాల్లో బీపీసీఎల్ కన్సాలిడేటెడ్ ఇబిటా నష్టం రూ. 2,958.91 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ ప్రకటించడంతో బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో పీబీటీ రూ.4,961.79 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో ఆయిల్ ధరలు తగ్గడంతో బీపీసీఎల్ నష్టం రూ.1,081 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ తెలిపింది. కోవిడ్-19 కారణంగా బీపీసీఎల్ క్రూడ్ డిమాండ్ 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ టన్నులకు చేరింది. విక్రయాలు సైతం 9 శాతం పతనమై 11.24 మిలియన్ టన్నులకు చేరాయి. ఏప్రిల్ నెలలో క్రూడ్ డిమాండ్ 55 శాతం తగ్గింది. మేనెలలో లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ వార్షిక ప్రాతిపదికన 30 శాతం తక్కువగానే విక్రయాలు జరిగాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. కాగా ఉదయం 11:45 గంటల ప్రాంతంలో బీపీసీఎల్ షేరు 2.4 శాతం నష్టపోయి రూ.357.60 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment