1,099లకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ ప్లాన్ | BSNL launches unlimited 3G plan for Rs 1,099, cuts rate by 50% | Sakshi
Sakshi News home page

1,099లకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ ప్లాన్

Published Thu, Aug 25 2016 1:09 AM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM

1,099లకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ ప్లాన్ - Sakshi

1,099లకు బీఎస్ఎన్ఎల్ అపరిమిత 3జీ ప్లాన్

పలు ప్లాన్స్‌కు రెట్టింపు డేటా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా అపరిమిత 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.1,099గా ఉంది. వాలిడిటీ 30 రోజులు. అలాగే పలు 3జీ డేటా ప్లాన్స్‌కు అదనపు డేటాను ప్రకటించింది. స్పీడ్‌ను తగ్గించకుండా రూ.1,099లకే అపరిమిత 3జీ ప్లాన్‌ను తామే తొలిగా ప్రకటిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అనుపమ్ శ్రీవత్సవా తెలిపారు. వినియోగదారులు రూ.549ల 3జీ ప్లాన్‌లో ఇదివరకటిలా 5 జీబీ కాకుండా 10 జీబీ డేటాను పొందొచ్చని అన్నారు. దీని వాలిడిటీ 30 రోజుల పాటు ఉంటుందన్నారు. అలాగే రూ.156 ప్లాన్‌తో 2 జీబీ డేటా పొందొచ్చని, దీని వాలిడిటీ 10 రోజులని చె ప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement