
బీఎస్‌ఎన్‌ఎల్‌లో డేటా క్యారీ ఫార్వర్డ్ సదుపాయం
న్యూఢిల్లీ: వాడుకోకుండా మిగిలిపోయిన మొబైల్ ఇంటర్నెట్ డేటాను తదుపరి రీచార్జ్‌లో వినియోగించుకునేలా (క్యారీ ఫార్వర్డ్) బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది 2జీ, 3జీ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. 3జీ సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కొంగొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. 10 రోజుల కాలవ్యవధితో 1జీబీ మేర 3జీ మొబైల్ డేటాకి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే రూ. 68 విలువ చేసే డేటా స్పెషల్ టారిఫ్ వోచర్ (ఎస్‌టీవీ)ని ప్రవేశపెట్టింది.