బఫెట్ కంపెనీ భారీ డీల్
37.2 బిలియన్ డాలర్లతో ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్ కొనుగోలు
న్యూయార్క్: బిలియనీర్ ఇన్వెస్టరు వారెన్ బఫెట్‌కి చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే తాజాగా భారీ కొనుగోలు డీల్‌కు తెర తీసింది. విమానాల విడిభాగాల తయారీ సంస్థ ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్‌ను 37.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఈక్విటీ భాగం 32.64 బిలియన్ డాలర్లు కాగా మిగతాది డెట్ రూపంలో ఉంటుంది. ప్రెసిషన్ క్యాస్ట్‌పార్ట్స్ షేరు శుక్రవారం 193.88 డాలర్ల దగ్గర ట్రేడవగా బెర్క్‌షైర్ 21.2% ప్రీమియంతో షేరు ఒక్కింటికి 235 డాలర్లు ఆఫర్ చేసింది. 2010లో బర్లింగ్‌టన్ నార్తర్న్ శాంటా ఫే రెయిల్‌రోడ్‌ను 26.5 బిలియన్ డాలర్లతో టేకోవర్ చేసిన తర్వాత బెర్క్‌షైర్‌కి ఇదే అతి పెద్ద డీల్.