బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌ | Byjus Raveendran Join in Billionaire List | Sakshi
Sakshi News home page

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

Published Tue, Jul 30 2019 1:10 PM | Last Updated on Tue, Jul 30 2019 1:10 PM

Byjus Raveendran Join in Billionaire List - Sakshi

న్యూఢిల్లీ: దేశ బిలియనీర్ల జాబితాలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్‌ చేరారు. కతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ)–సావరిన్‌ వెల్త్‌  ఫండ్‌ నుంచి  బైజూస్‌కు 150 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ లభించడంతో రవీంద్రన్‌   బిలియనీర్ల జాబితాలోకి వచ్చి చేరారు. దీనితో కంపెనీ విలువ 6 బిలియన్‌ డాలర్లకు చేరింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థలో రవీంద్రన్‌కు 21% మేర వాటా ఉంది. కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో బైజూస్‌ ఆదాయం మూడింతలై రూ.1,430 కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement