సెల్‌కాన్ ‘రూ.1కే మొబైల్’ ఆఫర్... | Celkon A35k Remote offers Rs.1 Mobile | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ ‘రూ.1కే మొబైల్’ ఆఫర్...

Published Tue, Jan 12 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

సెల్‌కాన్ ‘రూ.1కే మొబైల్’ ఆఫర్...

సెల్‌కాన్ ‘రూ.1కే మొబైల్’ ఆఫర్...

హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ తాజాగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు రూ.1కే ‘సీ345’ ఫీచర్ ఫోన్‌ను అందించే సరికొత్త పథకాన్ని ప్రకటించింది. వినియోగదారులు రూ.2,999తో ‘ఏ35కే రిమోట్’ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దానిపై వారు రూ.1 చెల్లించి మరో ‘సీ345’ ఫీచర్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సెల్‌కాన్ మొబైల్స్ కంపెనీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ యష్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ పరిమిత కాల ఆఫర్ వినియోగదారులకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని అన్ని ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ  పేర్కొంది. ప్రధాన పండుగ రోజుల్లో వినియోగదారుల వేడుకల్లో భాగ మవ్వడానికి, అలాగే వారికి మరింత దగ్గరవ్వడం కోసం ఈ వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సెల్‌కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. సీ345, ఏ35కే మోడళ్లు అత్యుత్తమ పనితీరు కనపర్చే హ్యాండ్‌సెట్స్ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీ రేతినేని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement