Celkon mobiles
-
సెల్కాన్ 4జీ మొబైల్ రూ.6,666
హైదరాబాద్ : సెల్కాన్ మొబైల్స్ డైమండ్ సిరీస్‌లో భాగంగా క్యూ4జీప్లస్ పేరుతో డ్యుయల్ సిమ్ మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6,666. డైమండ్ సిరీస్‌లో భాగంగా కంపెనీ లోగడ 4జీ ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, దీనికి మంచి ఆదరణ రావడంతో అదనపు ఫీచర్లు, హంగులు జోడించి క్యూ4జీ ప్లస్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 4ఎక్స్‌కార్టెక్స్ ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ సాంకేతికతతో ఇంటర్నెట్ విని యోగం అనూహ్యంగా పెరుగుతుందని భావిస్తున్నట్టు మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా సెల్కాన్ సీఎండీ వై గురు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రానున్న నెలల్లో మరిన్ని 4జీ మొబైల్స్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. -
సెల్కాన్ ‘రూ.1కే మొబైల్’ ఆఫర్...
హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ సెల్కాన్ మొబైల్స్ తాజాగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు రూ.1కే ‘సీ345’ ఫీచర్ ఫోన్‌ను అందించే సరికొత్త పథకాన్ని ప్రకటించింది. వినియోగదారులు రూ.2,999తో ‘ఏ35కే రిమోట్’ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దానిపై వారు రూ.1 చెల్లించి మరో ‘సీ345’ ఫీచర్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సెల్కాన్ మొబైల్స్ కంపెనీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ యష్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన ఈ పరిమిత కాల ఆఫర్ వినియోగదారులకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని అన్ని ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ప్రధాన పండుగ రోజుల్లో వినియోగదారుల వేడుకల్లో భాగ మవ్వడానికి, అలాగే వారికి మరింత దగ్గరవ్వడం కోసం ఈ వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. సీ345, ఏ35కే మోడళ్లు అత్యుత్తమ పనితీరు కనపర్చే హ్యాండ్సెట్స్ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మురళీ రేతినేని పేర్కొన్నారు. -
మేడ్ ఇన్ ఇండియా సెల్కాన్ మొబైల్స్
హైదరాబాద్, బిజనెస్ బ్యూరో : సెల్ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ మొబైల్స్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ప్లాంటును శుక్రవారం ప్రారంభించారు. తొలుత నెలకు 2 లక్షల ఫోన్లను అసెంబుల్ చేయనున్నారు. ఈ సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్ల స్థాయికి చేర్చనున్నారు. దేశీ యంగా తయారీతో మోడళ్ల ధర 7-8 శాతం తగ్గనుంది. ఇప్పటి వరకు మేడ్ ఇన్ చైనా పేరుతో వచ్చిన కంపెనీ ఫోన్లు ఇక నుంచి మేడ్ ఇన్ ఇండియాగా కూడా రానున్నాయని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. దక్షిణాదిన అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటవడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఇతర కంపెనీలూ దక్షిణాదికి వచ్చేం దుకు మార్గం సుగమం అయిందని అన్నారు. అన్ని మోడళ్లు ఇక్కడే.. ప్రస్తుతం నాలుగు బేసిక్ ఫోన్లను మేడ్చల్ ప్లాంటులో అసెంబుల్ చేస్తున్నారు. జూలై నుంచి స్మార్ట్ఫోన్లు కూడా వీటికి తోడవనున్నాయి. ఆరు నెలల్లో అన్ని మోడళ్లు ఇక్కడే అసెంబుల్ చేస్తామని గురు పేర్కొన్నారు. ‘నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నాం. ల్యాబ్‌లో పరీక్షించాకే ఫోన్లను బయటకు తీసుకొస్తున్నాం. చైనాకు చెందిన నిపుణుల బృందం ఇక్కడే ఉండి తయారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఇందుకు వ్యయం పెరిగినా భారత్‌లో తయారీని చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో సాగుతున్నాం’ అని చెప్పారు. మేడ్చల్‌తోపాటు ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు కలిపి రూ.250 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మేడ్చల్ ప్లాంటులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 100 మంది శిక్షణలో ఉన్నారు. మరో 900 మందిని నియమించనున్నా రు. ప్లాంటు స్థాపించాలన్న తమ మూడేళ్ల కల నెరవేరిందని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని అన్నారు. నెలకు 7 లక్షల హ్యాండ్సెట్లు విక్రయిస్తున్నామని, దీన్ని 10 లక్షలకు తీసుకెళ్తామని చెప్పారు. మరిన్ని కంపెనీలు..: మొబైల్స్ తయారీ రంగంలో తెలంగాణలో ఇది ఆరంభం మాత్రమేనని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. సెల్కాన్ ప్లాంటు ఏర్పాటవడం గర్వంగా ఉందన్నారు. మరిన్ని మొబైల్ కంపెనీలు ప్లాంట్ల స్థాపనకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. ‘మొబైల్స్ తయారీ హబ్ ఏర్పాటుకు సీఎం కె.చంద్రశేఖర రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ సైతం సుముఖంగా ఉంది. మైక్రోమ్యాక్స్ ప్లాంటు రాబోతోంది. తైవాన్ కంపెనీలను ఆహ్వానించాం. కొరియా, జపాన్‌కు త్వరలో వెళ్తాం. మానవ వనరుల శిక్షణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది’ అని చెప్పారు. అనలాగ్ ఫ్యాబ్ యూనిట్ ఏర్పాటుకై యూఎస్‌కు చెందిన క్రికెట్ సెమికండక్టర్ కంపెనీతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. -
సెల్కాన్ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో..
క్యూ5కే పవర్ ధర రూ.5,222 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్కాన్ మొబైల్స్.. మిలీనియా సిరీస్‌లో క్యూ5కే పవర్ పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించింది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. బ్యాటరీ స్టాండ్ బై 15 రోజులు. ఒకసారి చార్జింగ్ చేస్తే 24 గంటలపాటు మాట్లాడుకోవచ్చు. 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, కిట్‌క్యాట్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆటో ఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. డ్యూయల్ సిమ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, వైఫై, బ్లూటూత్, డ్యూయల్ సిమ్, కస్టమైజ్డ్ గెస్చర్ కంట్రోల్స్ ఇతర విశిష్టతలు. ధర రూ.5,222. వినియోగదారులకు అత్యుత్తమ మోడళ్లను అందుబాటు ధరలో అందించ డాన్ని తాము కొనసాగిస్తున్నామని సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ మోడల్ లభించడం భారత్‌లో ఇదే తొలిసారి అని వివరించారు.