సెల్‌కాన్ 4జీ మొబైల్ రూ.6,666 | Celkon launches Diamond Q4G Plus: Price and specifications | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ 4జీ మొబైల్ రూ.6,666

Published Mon, Aug 8 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

సెల్‌కాన్ 4జీ మొబైల్ రూ.6,666

సెల్‌కాన్ 4జీ మొబైల్ రూ.6,666

హైదరాబాద్ : సెల్‌కాన్ మొబైల్స్ డైమండ్ సిరీస్‌లో భాగంగా క్యూ4జీప్లస్ పేరుతో డ్యుయల్ సిమ్ మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.6,666. డైమండ్ సిరీస్‌లో భాగంగా కంపెనీ లోగడ 4జీ ప్లస్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగా, దీనికి మంచి ఆదరణ రావడంతో అదనపు ఫీచర్లు, హంగులు జోడించి క్యూ4జీ ప్లస్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది.

2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 4ఎక్స్‌కార్టెక్స్ ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్, 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా తదితర సదుపాయాలు ఉన్నాయి. 4జీ సాంకేతికతతో ఇంటర్నెట్ విని యోగం అనూహ్యంగా పెరుగుతుందని భావిస్తున్నట్టు మొబైల్ ఆవిష్కరణ సందర్భంగా సెల్‌కాన్ సీఎండీ వై గురు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రానున్న నెలల్లో మరిన్ని 4జీ మొబైల్స్‌ను ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement