సెల్‌కాన్‌ స్మార్ట్‌ఫోన్లో రెండు వాట్సాప్‌ అకౌంట్లు | cell con smartphone Two accounts whatsapp | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్‌ స్మార్ట్‌ఫోన్లో రెండు వాట్సాప్‌ అకౌంట్లు

Published Wed, Feb 1 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

సెల్‌కాన్‌ స్మార్ట్‌ఫోన్లో రెండు వాట్సాప్‌ అకౌంట్లు

సెల్‌కాన్‌ స్మార్ట్‌ఫోన్లో రెండు వాట్సాప్‌ అకౌంట్లు

రెండు ఫేస్‌బుక్‌ ఖాతాలు కూడా
డైమండ్‌ సిరీస్‌లో కొత్త 4జీ మోడళ్లు
వడ్డీలేని వాయిదాల్లోనూ విక్రయం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉన్న సెల్‌కాన్‌ తాజాగా డైమండ్‌ సిరీస్‌లో రెండు 4జీ మోడళ్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. రెండు వాట్సాప్, రెండు ఫేస్‌బుక్‌ అకౌంట్లను నిర్వహించుకునే ఏర్పాటు ఉండడం ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేకత. భారతీయ బ్రాండ్‌ నుంచి ఈ ఫీచర్లతో మోడళ్లు రావడం ఇదే ప్రథమం అని సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. హోమ్‌ క్రెడిట్‌ కంపెనీతో చేతులు కలిపినట్టు చెప్పారు. వడ్డీలేని వాయిదాల్లో ఈ ఫోన్లను కొనుక్కోవచ్చన్నారు. 2017లో 4జీ పైనే ఫోకస్‌ చేస్తామన్నారు. మరో 10–12 మోడళ్లు ప్రవేశపెడతామన్నారు. రూ.15 వేల శ్రేణిలోనూ స్మార్ట్‌ఫోన్ల తయారీ మొదలు పెడతామని వివరించారు. ఫిబ్రవరి నుంచి విదేశాలకు కొత్త మోడళ్ల ఎగుమతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రూ.1,999లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజల్లో సెల్‌కాన్‌ విడుదల చేయనుంది.

పరిశోధన కేంద్రం..
సెల్‌కాన్‌ ఆర్‌అండ్‌డీ కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానుందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. తెలంగాణలో స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ కలను కంపెనీ నిజం చేసిందని అన్నారు. ‘డిజిటల్‌ చెల్లింపుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అందుబాటు ధరలకుతోడు స్థానిక భాషలను సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్ల రాకతో డిజిటల్‌ చెల్లింపులు అధికమవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ ప్లాంటులో 18 నెలల్లో 50 లక్షలకుపైగా ఫోన్లను తయారు చేశామని సెల్‌కాన్‌ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. అందుబాటు ధరలో, ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు. రూ.10 వేలలోపు మోడళ్లకు రుణ సౌకర్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు.

ఇవీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు..
రెండు మోడళ్లనూ 2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌తో రూపొందించారు. ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్‌ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, పిక్చర్‌ నాణ్యతను పెంచే బ్యూటీ ప్లస్‌ యాప్‌ ఏర్పాటు ఉంది. ఫ్లో యూఐ, 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌కోర్‌ కార్టెక్స్‌ ఏ7 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్‌ 6 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ ఇతర ఫీచర్లు. 21 భాషలను ఇవి సపోర్ట్‌ చేస్తాయి. డైమండ్‌ ‘యు’ స్మార్ట్‌ఫోన్‌ను 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో తయారు చేశారు. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ దీని ప్రత్యేకత. 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ పొందుపరిచారు. ధర రూ.5,999 ఉంది. డైమండ్‌ మెగా మోడల్‌ను 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేతో తయారు చేశారు. 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ధర రూ.6,400గా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement