cell-con
-
సెల్కాన్ స్మార్ట్‌ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు
రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా డైమండ్ సిరీస్‌లో కొత్త 4జీ మోడళ్లు వడ్డీలేని వాయిదాల్లోనూ విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న సెల్కాన్ తాజాగా డైమండ్ సిరీస్‌లో రెండు 4జీ మోడళ్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ అకౌంట్లను నిర్వహించుకునే ఏర్పాటు ఉండడం ఈ స్మార్ట్ఫోన్ల ప్రత్యేకత. భారతీయ బ్రాండ్ నుంచి ఈ ఫీచర్లతో మోడళ్లు రావడం ఇదే ప్రథమం అని సెల్కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా తెలిపారు. హోమ్ క్రెడిట్ కంపెనీతో చేతులు కలిపినట్టు చెప్పారు. వడ్డీలేని వాయిదాల్లో ఈ ఫోన్లను కొనుక్కోవచ్చన్నారు. 2017లో 4జీ పైనే ఫోకస్ చేస్తామన్నారు. మరో 10–12 మోడళ్లు ప్రవేశపెడతామన్నారు. రూ.15 వేల శ్రేణిలోనూ స్మార్ట్ఫోన్ల తయారీ మొదలు పెడతామని వివరించారు. ఫిబ్రవరి నుంచి విదేశాలకు కొత్త మోడళ్ల ఎగుమతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రూ.1,999లకే 3జీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజల్లో సెల్కాన్ విడుదల చేయనుంది. పరిశోధన కేంద్రం.. సెల్కాన్ ఆర్అండ్డీ కేంద్రం త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానుందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. తెలంగాణలో స్మార్ట్ఫోన్ల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ కలను కంపెనీ నిజం చేసిందని అన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అందుబాటు ధరలకుతోడు స్థానిక భాషలను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల రాకతో డిజిటల్ చెల్లింపులు అధికమవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ ప్లాంటులో 18 నెలల్లో 50 లక్షలకుపైగా ఫోన్లను తయారు చేశామని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని వెల్లడించారు. అందుబాటు ధరలో, ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు. రూ.10 వేలలోపు మోడళ్లకు రుణ సౌకర్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇవీ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు.. రెండు మోడళ్లనూ 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో రూపొందించారు. ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, పిక్చర్ నాణ్యతను పెంచే బ్యూటీ ప్లస్ యాప్ ఏర్పాటు ఉంది. ఫ్లో యూఐ, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్ 6 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ ఇతర ఫీచర్లు. 21 భాషలను ఇవి సపోర్ట్ చేస్తాయి. డైమండ్ ‘యు’ స్మార్ట్‌ఫోన్‌ను 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ దీని ప్రత్యేకత. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. ధర రూ.5,999 ఉంది. డైమండ్ మెగా మోడల్‌ను 5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో తయారు చేశారు. 2700 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ధర రూ.6,400గా నిర్ణయించారు. -
ఆక్టాకోర్‌లోకి సెల్కాన్ మొబైల్స్
మిలేనియా ఆక్టా 510 విడుదల చైనాలో ప్రొడక్ట్ డిజైన్ హౌజ్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఈ ఏడాదే సెల్కాన్ ఈడీ మురళి రేతినేని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్కాన్ ఆక్టాకోర్ విభాగంలోకి ప్రవేశించింది. మిలేనియా ఆక్టా 510 పేరుతో తొలి మోడల్‌ను సినీ నటి తమన్నా భాటియా చేతుల మీదుగా బుధవారమిక్కడ ఆవిష్కరించింది. హాట్‌నాట్ ఫీచర్‌ను ప్రపంచంలో తొలిసారిగా ఈ మొబైల్లో వాడారు. ఈ ఫీచర్ కలిగిన రెండు ఫోన్లను ఎదురెదురుగా ఉంచితే క్షణాల్లో ఫైళ్లన్నీ బదిలీ అవుతాయి. 700 ఎంబీ సినిమాను 15 సెకన్లలో మరో ఫోన్లోకి పంపించొచ్చు. ఇంటెల్లిజెంట్ వేక్ అప్ అనే ఫీచర్ ఇందులో ఉంది. లాక్ అయిన స్క్రీన్‌పై ఇంగ్లీషులో ‘సి’ అని రాస్తే కెమెరా, ఎం-మ్యూజిక్, వి-వీ డియో, ‘ఇ’ అని రాస్తే బ్రౌజర్ తెరుచుకుంటుంది. 5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్, ఓజీఎస్ డిస్ప్లే, 1.4 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3జీ, కిట్‌క్యాట్ ఓఎస్‌తో ఫోన్ తయారైంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇతర విశిష్టతలు. ధర రూ.8,999. భవిష్యత్ మోడళ్లన్నీ..: ఆధునిక ఫీచర్లతో ఆక్టా 510 రూపొందిందని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీకి ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. హై ఎండ్ ఫోన్లలో ఉండే స్మార్ట్ గెస్చర్, హ్యాండ్స్ ఫ్రీ సెల్ఫీ, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఫోన్లో పొందుపరిచారు. భవిష్యత్ మోడళ్లన్నీ హాట్నాట్తో రానున్నాయని కంపెనీ ఈడీ మురళి రేతినేని మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్.. మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంట్‌ను 2015-16లోనే ఏర్పాటు చేస్తామని మురళి చెప్పారు. పన్ను ప్రయోజనాలపై స్పష్టత వచ్చాకే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పేది ప్రకటిస్తామని అన్నారు. తొలుత నెలకు 1 లక్ష ఫోన్ల అసెంబ్లింగ్ చేపట్టాలన్నది ప్రణాళిక అని వెల్లడించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి కంపెనీ ప్రణాళిక వెల్లడించామన్నారు. ఐటీ క్లస్టర్ ఒకటి అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రిని కోరామన్నారు.